https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ ముచ్చటపడిన అల వైకుంఠపురములో చిత్రంలోని లగ్జరీ బంగ్లా ఎవరిదో తెలుసా? దాని ధర ఎంతంటే?

అల వైకుంఠపురములో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీలక సన్నివేశాలు ఓ లగ్జరీ బంగ్లాలో చిత్రీకరించారు. కాగా ఈ బంగ్లా పై అల్లు అర్జున్ ముచ్చట పడ్డారట. ఎప్పటికైనా అలాంటి ఓ భవనం నిర్మించుకోవాలి అనుకున్నారట. అయితే దాని ధర వందల కోట్లలో ఉంది. ఇక ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకుందాం..

Written By:
  • S Reddy
  • , Updated On : October 10, 2024 / 08:15 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun :  2020లో విడుదలైన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఆ ఏడాదికి అల వైకుంఠపురములో సంక్రాంతి విన్నర్ కూడాను. అల్లు అర్జున్ ఇమేజ్ ని పెంచిన చిత్రంగా అల వైకుంఠపురములో ఉంది. కాగా కథలో భాగంగా ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు ఓ లగ్జరీ బంగ్లాలో చిత్రీకరించారు.

    ప్రేక్షకులను ఆ ఇల్లు కట్టి పడేసింది. మూవీలో హీరో తల్లిదండ్రులైన టబు, జయరాం బాగా రిచ్. వారు వ్యాపారవేత్తలు. వారి బంగ్లాగా ఆ లగ్జరీ ఇంటిని చూపించారు. ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారని సమాచారం.   కాగా ఆ ఇంట్లో చాలా రోజులు షూటింగ్ చేసిన అల్లు అర్జున్… బాగా ఇష్టపడ్డాడట. ఎప్పటికైనా అలాంటి ఓ విశాలమైన లగ్జరీ హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నాడట. అయితే అంత ఈజీ కాదు.

    ఆ ఇంటి ధర అక్షరాలా రూ. 300 కోట్లు. ప్రస్తుత మార్కెట్ ధరకు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో ఆ ఇల్లు ఉంది. అనుకోకుండా త్రివిక్రమ్ కంట్లో ఆ ఇల్లు పడింది. తన కథకు బాగా సెట్ అవుతుందని.. యజమానులను ఒప్పించి చిత్రీకరణ జరిపారు. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదంటే.. ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అల్లుడిది.

    తన కూతురు రచన చౌదరి భర్తకు చెందినదే ఆ హౌస్ అట. నరేంద్ర చౌదరి అల్లుడు కూడా బాగా డబ్బున్న రిచ్ ఇండస్ట్రియలిస్ట్ అని సమాచారం. ఆయన చాలా కాలం క్రితం ఈ లగ్జరీ బంగ్లా నిర్మించుకున్నారట. అదన్నమాట సంగతి. అల వైకుంఠపురములో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సచిన్, మురళీశర్మ కీలక రోల్స్ చేశారు. సుశాంత్, నివేద పేతురాజ్ మరో జంటగా నటించారు.

    అల వైకుంఠపురములో చిత్రానికి ఎస్ఎస్ థమన్ అందించిన సాంగ్స్ హైలెట్. ప్రతి సాంగ్ ఒక బ్లాక్ బస్టర్. ఈ చిత్రంలో మురళి శర్మ కుట్ర కారణంగా మిడిల్ క్లాస్ కష్టాలు పడే రిచ్ కిడ్ రోల్ చేశాడు అల్లు అర్జున్. భిన్నమైన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు.