Ramya Krishna childhood pics
Star Heroine: చాలామంది హీరోయిన్లు మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమా హీరోయిన్లుగా మారి వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాను కూడా తను కేర్ ఫుల్ గా చేస్తూ తమ స్టార్ డమ్ ఎక్కడ పడిపోకుండా చూసుకుంటూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీమణులు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఒక చిన్న బిస్కెట్ యాడ్ లో నటించి నటిగా మారడమే కాకుండా దాదాపు 200 పైన సినిమాల్లో నటించి ప్రేక్షకులందరిని మెప్పించింది. ఇక హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనను మించిన నటీమణి మరొకరు లేరు అనేలా నటించడమే కాకుండా హీరోలకు సైతం తన నటనతో సవాళ్లను విసిరింది. ఇక పైన కనిపిస్తున్న ఆ చిన్నారే ఇప్పుడు మనం చెప్పుకున్న స్టార్ హీరోయిన్…ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?
Also Read: Jr NTR: పెళ్లి కి ముందు ఆ హీరోయిన్ తో ఎఫైర్ నిజమే… ఓపెన్ గా లవ్ మేటర్ బయటపెట్టిన ఎన్టీఆర్!
నీలాంబరి గా ఎవరి మీద అయిన పగ పడితే తన పగ ఎలా ఉంటుందో చూపించిన నటీమణి రమ్యకృష్ణ… ఇక ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ ఒకప్పుడు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో శివగామి గా నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ ఈ సినిమాతో ఒకసారిగా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక వరుస సినిమాల్లో ఆఫర్లను కూడా అందుకుంటుంది.
Also Read: Bigg Boss Priyanka: నిస్సిగ్గుగా అతడితో సహజీవనం చేస్తున్న బిగ్ బాస్ ప్రియాంక… విలువలు వదిలేశారుగా!
ఇక ఇప్పటికి కూడా ఆమె ఒక చిన్న యాడ్ తన లైఫ్ ను మార్చేసింది అంటూ చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటుంది. మొత్తానికైతే ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కొన్ని ఆఫర్స్ ని అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది…