Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ చిత్రంలో విలన్ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అతనేనా..? చేసుంటే వేరే రేంజ్ లో ఉండేది!

సూర్య కంటే ముందుగా ఒక టాలీవుడ్ యంగ్ హీరోని ఈ సినిమాలో విలన్ రోల్ కోసం తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, మంచు మనోజ్. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మనోజ్, హీరో గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసాడు.

Written By: Vicky, Updated On : August 29, 2024 5:49 pm

Saripodhaa Sanivaaram

Follow us on

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టీజర్, ట్రైలర్ విడుదలకు ముందు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అమితాసక్తిని పెంచాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు హీరో నాని కంటే ఎక్కువగా విలన్ గా నటించిన ఎస్ జె సూర్య గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇది వరకే మనం ఎస్ జె సూర్య నట విశ్వరూపాన్ని అనేక తమిళ డబ్బింగ్ సినిమాల్లో చూసాము. సోషల్ మీడియాలో అత్యధికంగా ఆయన మీమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఒక సినిమాలో ఎస్ జె సూర్య ఉన్నాడంటే చాలు, ఆ సినిమా సగం హిట్ అయ్యిపోయినట్టే, ఆ రేంజ్ లో నటిస్తాడు ఆయన. అందుకే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఏరికోరి ఎస్ జె సూర్య ని ఈ సినిమా కోసం తీసుకొచ్చాడు.

అయితే సూర్య కంటే ముందుగా ఒక టాలీవుడ్ యంగ్ హీరోని ఈ సినిమాలో విలన్ రోల్ కోసం తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, మంచు మనోజ్. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మనోజ్, హీరో గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసాడు. కానీ మధ్యలో చాలా కాలం గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు హీరో రోల్స్ కంటే ఎక్కువగా విలన్ రోల్స్ పై ద్రుష్టి సారిస్తున్నారు. తేజ సజ్జ హీరో గా నటిస్తున్న ‘మిరాయ్’ అనే పాన్ ఇండియన్ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా కంటే ముందే మంచు మనోజ్ ని ‘సరిపోదా శనివారం’ చిత్రం కోసం అడిగాడట డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.

మనోజ్ కి కథ బాగా నచ్చింది కానీ, క్లైమాక్స్ నచ్చలేదట, మార్చమని చెప్పడంతో డైరెక్టర్ అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ లోకి మనోజ్ బదులుగా ఎస్ జె సూర్య వచ్చాడు. అయితే మంచు మనోజ్ ఈ పాత్ర చేసి ఉంటే ఆయనకి నేడు మంచి కం బ్యాక్ అయ్యేది. మనోజ్ కాబట్టి ఆ పాత్రని డైరెక్టర్ మరింత శక్తివంతంగా తీర్చి దిద్దేవాడు. ఇది ఇలా ఉండగా సరిపోదా శనివారం చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయని ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. నాని కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ‘దసరా’. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి మొదటి రోజు 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఆ స్థాయి వసూళ్లు అయితే రావు కానీ, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.