Jio Cloud Offer: జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ వెల్ కమ్ ఆఫర్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇది చాలా మంది యూజర్లకు నిజంగా గుడ్ న్యూసే. ఈ ఏడాది దీపావళి నుంచి రిలయన్స్ ఏఐ క్లౌడ్ స్టోరేజ్ ను ప్రారంభించబోతున్నది. దీంతో పాటు వెల్ కమ్ ఆఫర్ కింద జియో యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీని ఇవ్వబోతున్నది. ఈ మేరకు ముందుగా ఊహించినట్లుగానే కంపెనీలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముకేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఏదైనా కీలక ప్రకటన రావొచ్చని యూజర్లు ఎదురు చూశారు. వారి ఆశలను నిజం చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈ ఆఫర్ ప్రకటించారు. కంపెనీ యొక్క 47వ వార్షిక సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో ఆయన సుమారు 35 లక్షల మంది కంపెనీ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ ప్రస్థానాన్ని వివరిస్తూనే కొత్త ఆఫర్ ను ప్రకటించారు. ఫొటోలు, డాక్యుముంట్లు, డిజిటల్ కంటెంట్లు, వీడియోలు దాచుకునేందుకు ఈ జియో క్లౌడ్ స్టోరేజ్ ను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ వెల్ కమ్ ఆఫర్ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే దీనికి అదనంగా చార్జీలు కట్టాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ అనేది కొందరికి మాత్రమే సౌకర్యం కాకుడదని మేం భావిస్తున్నామని తెలిపారు. అందుకే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్రయత్నిస్తున్నదని తెలిపారు. కృత్రిమ మేధతో తమ యూజర్ల కోసం ఏఐ ఫ్లాట్ ఫామ్ జియో బ్రెయిన్ ను ప్రత్యేకంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. జియో బ్రెయిన్ ను రిలయన్స్ లోని ఇతర కంపెనీల్లోనూ వినియోగించబోతున్నాం. విద్య, వ్యాపారం, దవాఖాన, వ్యవసాయ, తదితర రంగాల్లో ఈ సేవలను వినియోగిస్తాం. యూజర్లకు పారదర్శక, కచ్చిత సేవలు, వేగవంతం గా అందజేయడం మా బాధ్యత అంటూ వివరించారు. దేశాన్ని సుసంపన్నంగా మార్చడమే తమ అభిమతమని పేర్కొన్నారు. స్వల్పకాలంలో వచ్చే లాభాలు మాకు అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. యూజర్లకు వేగవంతమైన సేవలను అందిస్తామని గట్టిగా నొక్కి చెప్పారు.
ఇక వరల్డ్ లోనే అతి పెద్ద టెలికాం, డేటా మార్కెట్ గా భారత్ నిలిచిందని ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో తెలిపారు. ఇక జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ నెట్ వర్క్ కంపెనీగా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం జియోను 49 కోట్ల కస్టమర్లు వినియోగిస్తున్నారు. నెలకు సగటున 30 జీబీ డాటాను వారు వినియోగిస్తున్నారని ప్రసంగంలో తెలిపారు. ఇక ప్రపంచ మొబైల్ ట్రాఫిక్ లో జియో సంస్థ వాటా సుమారు 8 శాతం ఉందని పేర్కొన్నారు. ఇక 5జీ, 6 జీ సాంకేతికతలో 350 పేటోంట్లను ఇప్పటివరకు ఫైల్ చేసినట్లు తెలిపారు. ఏదేమైనా ముందుగా ఊహించినట్లుగానే జియో ఈ ఏడాది కూడా ఒక సరికొత్త ప్రకటనతో వచ్చేసింది. వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో కంపెనీలు వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ ప్రకటన ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు.