https://oktelugu.com/

Aa Naluguru: ‘ఆ నలుగురు’ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ పాత్రని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేదిగా!

కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవ్వొచ్చు, కానీ మంచి సినిమా తీశామనే తృప్తి మిగులుతుంది. అలాంటి చూడచక్కని కుటుంబ గాధగా ప్రముఖ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్ , డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని పెట్టి తీసిన చిత్రం 'ఆ నలుగురు'. అప్పట్లో ఈ సినిమాని విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచి ఎత్తారు. కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు మన నిజజీవితం లో తరచూ చూసే పాత్రలే వెండితెర మీద కనిపిస్తాయి.

Written By:
  • Vicky
  • , Updated On : June 6, 2023 / 09:35 AM IST

    Aa Naluguru

    Follow us on

    Aa Naluguru: జీవితం యొక్క అర్థం గురించి చెప్పే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, అవి మనలోని మానవత్వాన్ని ఒక్కసారి గుర్తు చేస్తుంటాయి. అలాంటి సినిమాలను కచ్చితంగా చూడాల్సిందే. డైరెక్టర్స్ కూడా డబ్బులు వస్తుందా లేదా అనే భయం తో అలాంటి సినిమాలు తీసే ప్రయత్నం మానుకోకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు అలాంటి సినిమాలే కమర్షియల్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ ఉంటాయి.

    కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవ్వొచ్చు, కానీ మంచి సినిమా తీశామనే తృప్తి మిగులుతుంది. అలాంటి చూడచక్కని కుటుంబ గాధగా ప్రముఖ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్ , డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని పెట్టి తీసిన చిత్రం ‘ఆ నలుగురు’. అప్పట్లో ఈ సినిమాని విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచి ఎత్తారు. కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు మన నిజజీవితం లో తరచూ చూసే పాత్రలే వెండితెర మీద కనిపిస్తాయి.

    అప్పటి వరకు వరుసగా కామెడీ పాత్రలను వేస్తూ వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ని, మొట్టమొదటిసారి ఇలా చూసేలోపు ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం లో కోట శ్రీనివాసరావు నటవిశ్వరూపం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేను. చిరకాలం గుర్తించుకోదగ్గ చిత్రం ఇది. అయితే ఈ సినిమా కథ రాజేంద్ర ప్రసాద్ దగ్గరకి వెళ్లేముందు చాలా మంది హీరోల చుట్టూ తిరిగింది. ఈ చిత్రాన్ని మొదట సూపర్ స్టార్ కృష్ణ తో చేద్దాం అనుకున్నారట, ఈ విషయమై ఆయనని కలవగా, ఫుల్ లెంగ్త్ రోల్స్ ని చేసేంత శక్తి ఇప్ప్పుడు లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించాడట.

    ఆ తర్వాత ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కోసం కూడా అడిగారు. ఆ సమయానికి ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవం తో ఆయన కూడా ఈ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసి, ఒక మంచి క్లాసిక్ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమకి అందించారు.