https://oktelugu.com/

Bichagadu 2 Closing Collections: ‘బిచ్చగాడు 2’ క్లోసింగ్ కలెక్షన్స్.. బయ్యర్స్ కి జాక్పాట్ అంటే ఇదే!

ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ సాగదీసాడు అంటూ టాక్ వచ్చింది, టాక్ ఎలాంటిది అయినా కూడా ఈ సినిమా కి హైప్ కారణంగా తెలుగు లో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ కి జాక్పాట్ తగిలిందనే చెప్పాలి.మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ట్రేడ్ కి షాక్ మీద షాక్ ఇస్తూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు క్లోసింగ్ కి వచ్చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల రూపాయలకు జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : June 6, 2023 / 09:32 AM IST

    Bichagadu 2 Closing Collections

    Follow us on

    Bichagadu 2 Closing Collections: ఈ సమ్మర్ లో వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినీ పరిశ్రమకి కాస్త ఉపశమనం కలిపించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు 2’. అప్పట్లో బిచ్చగాడు చిత్రం బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో కొల్లగొట్టిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తెలుగు లో 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే మాట్లాడుకునేవారు.

    టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. జనాల్లో అంతలా నాటుకుపోయిన సినిమాకి సీక్వెల్ అంటే కచ్చితంగా ప్రేక్షకులలో అంచనాలు ఉండడం సహజం. ‘బిచ్చగాడు 2 ‘ విషయం లో కూడా అదే జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.

    ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ సాగదీసాడు అంటూ టాక్ వచ్చింది, టాక్ ఎలాంటిది అయినా కూడా ఈ సినిమా కి హైప్ కారణంగా తెలుగు లో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ కి జాక్పాట్ తగిలిందనే చెప్పాలి.మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ట్రేడ్ కి షాక్ మీద షాక్ ఇస్తూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు క్లోసింగ్ కి వచ్చేసింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల రూపాయలకు జరిగింది.

    క్లోసింగ్ లో సుమారుగా 9 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే బయ్యర్స్ కి మూడు కోట్ల 50 లక్షల రూపాయిలు లాభాలు అన్నమాట. డివైడ్ టాక్ వస్తేనే ఇలాంటి వసూళ్లు వచ్చాయి, కాస్త సెకండ్ హాఫ్ మీద ద్రుష్టి పెట్టుంటే ఈ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండే 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టేదని, హీరో విజయ్ ఆంటోనీ మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.