Brahmotsavam: ‘బ్రహ్మోత్సవం’ సినిమాని తప్పించుకున్న స్టార్ హీరో అతనేనా..? మామూలు లక్ కాదుగా!

'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన శ్రీకాంత్ అడ్డాల నుండి ఇలాంటి సినిమా రావడం, అతను ఇండస్ట్రీ లో ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదలైన సంగతి తెలిసిందే.

Written By: Vicky, Updated On : May 20, 2023 7:41 pm

Brahmotsavam

Follow us on

Brahmotsavam: టాలీవుడ్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా ముందు వరుస లో ఉంటుంది. ‘శ్రీమంతుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేసిన చిత్రం ఇది. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఎంతలా అంటే మహేష్ బాబు స్టార్ ఇమేజి కూడా రిస్క్ లో పడేంతలా.ఇప్పటికీ ఈ చిత్రాన్ని తల్చుకుంటే మహేష్ ఫ్యాన్స్ కి ఒక పీడకల లాగ అనిపిస్తాడు.

‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన శ్రీకాంత్ అడ్డాల నుండి ఇలాంటి సినిమా రావడం, అతను ఇండస్ట్రీ లో ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన విక్టరీ వెంకటేష్ తో ‘నారప్ప’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదలైన సంగతి తెలిసిందే.

మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ముందుగా ఊర మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తీద్దాం అనుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజి ఉన్న హీరో తో ఇలాంటి సినిమా తియ్యాలని ఆలోచన ఆయనకీ ఎలా వచ్చిందో, ఎన్టీఆర్ కి కూడా అలాంటి ఫీలింగ్ వచ్చే ఈ చిత్రం లో నటించడానికి ‘నో’ చెప్పాడనుకుంటా.

ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకొని ఈ సినిమా చేసి ఉంటే, ఫ్యాన్స్ చేత ఆయనకీ చివాట్లు మామూలు రేంజ్ లో ఉండేవి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది.80 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది.