Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలి. ఈ సినిమా కి సంబందించిన అనౌన్స్ మెంట్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ సినిమా అనుకోని కారణాల వలన ఆగిపోయింది. ఇక దాంతో కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు.
అయితే కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాని చేస్తున్నప్పుడు మొదటి పార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకటి, రెండు సినిమాలు చేసి రెండో పార్ట్ చేద్దామనుకున్నాడు. కానీ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడం అలాగే పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ కి సుకుమార్ కి మంచి పేరు తీసుకొచ్చి పెట్టడంతో ఇక లేట్ చేయకుండా పుష్ప 2 ని వెంటనే రంగంలోకి దింపాలని అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు అనుకొని ఈ సినిమాని స్టార్ట్ చేశారు.
ఇక దాంతో కొరటాల శివ తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ కి అవకాశం కుదరలేదు. దానివల్లే వీళ్ళ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. దాంతో కొరటాల ఎన్టీఆర్ ని పెట్టి దేవర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందనేది క్లారిటీ అయితే లేదు. ఇక నిజానికి కొరటాల శివ మంచి రైటర్ గానే కాకుండా మంచి డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.
ఆయన మొదటి సినిమా అయిన మిర్చి సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క ఆచార్య ని మినహా ఇస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్కొక్క సినిమాతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చిన కొరటాల శివ కి ఆచార్య సినిమాతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు దేవర సినిమాతో హిట్ కొట్టి ఆయన మీద ఉన్న అపవాదుని తుడిచేసుకోవాలనే ఉద్దేశ్యంలో కొరటాల శివ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి వీళ్ళ కాంబోలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి…