Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది స్టార్ హీరోలు, వాళ్ళు చేసిన సినిమాలు. ఇక వాళ్లని మినహాయిస్తే డైరెక్టర్లలో మనకి ఎక్కువగా గుర్తొచ్చే పేరు రాజమౌళి…ఆయన ప్రతి హీరోతో సినిమా చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆ హీరోలకి వాళ్ళ కెరియర్ లోనే బెస్ట్ సినిమాలని ఇచ్చాడు. అలాగే అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాలను కూడా అందించాడు.అలాంటి రాజమౌళి తెలుగు వాడైనందుకు మనందరం గర్వపడాలి. రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను కొడుతున్నాడు.
ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు కదులుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ని అందుకోవడానికి కొంతమంది డైరెక్టర్లు తనతో పాటు పోటీపడుతున్నారు. ఇక వాళ్లలో ముఖ్యంగా శంకర్, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ లాంటి డైరెక్టర్లు ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళలో ఎవరు భారీ సక్సెస్ లను కొట్టి రాజమౌళిని అందుకుంటారు అనేది తెలియదు కానీ వీళ్ళందరూ కూడా రాజమౌళితో పాటు ఆయనంత టాలెంట్ ఉన్న దర్శకులనే చెప్పాలి… అయితే వీళ్ళందరికీ ఒక సరైన సక్సెస్ పడితే రాజమౌళి ని క్రాస్ చేసి ముందుకు వెళ్లే టాలెంట్ కూడా వీళ్ళందరిలో ఉంది. అయితే వీళ్లలో ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంది.
అందుకే రాజమౌళికి వీళ్ళకి మధ్య మంచి పోటీ ఉంటుంది. అయితే రాజమౌళి కమర్షియల్ స్టోరీని గ్రాఫిక్స్ ఆడ్ చేసి తీసి మెప్పించడం లో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అందుకే ఆయన సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక మిగతా డైరెక్టర్లకి తనకి కూడా అదే తేడా అని చాలామంది సినీ మేధావులు సైతం చాలా సార్లు చెప్పడం మనం చూశాం…
ఇక రాజమౌళిని మిగతా డైరెక్టర్లతో సపరేట్ చేసే అంశాలు కూడా ఇవే.ఒక శంకర్ ని మినహాయిస్తే మిగతా డైరెక్టర్లు రాజమౌళి లా గ్రాఫిక్స్ ని వాడుకొని భారీ సక్సెస్ లు కొట్టలేకపోతున్నారు. ఒకవేళ ఈ డైరెక్టర్లు ఫ్యూచర్ లో సూపర్ సక్సెస్ లను కనక కొడితే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందటం తో పాటు రాజమౌళి ని కూడా అందుకునే అవకాశాలైతే ఉన్నాయి…