Photo Story: ఈరోజు నిన్న చేసిన పోస్టులు మాత్రమే కాదు ఎప్పుడో చేసిన పోస్టులు కూడా ఇప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇక ఫోటోలు అయితే మరింత ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటాయి. ఒకప్పటి ఈ నటి ఇప్పుడెలా ఉందో తెలుసా? ఫలానా నటి ఏం చేస్తుందో తెలుసా? అంటూ ఒకప్పటి ఫోటోలు వైరల్ అవడం కామన్ గా చూస్తుంటాం. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇలాంటి ఫోటోలు రావడం కామన్. ఇక హీరోహీరోయిన్స్ త్రో బ్యాక్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ఈ ఫోటో ఎప్పటిదో అనుకుంటున్నారా? అయితే ఫోటోలు హీరో గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణను గుర్తుపట్టని వారుండరు. ప్రతి తెలుగు వారు గర్వంగా చెప్పే పేరే. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఆయనది. ఇక మీరు చూస్తున్న ఈ ఫోటో సినిమా ప్రారంభోత్సవం సమయంలోనిది. ఈ ఫోటోలు కృష్ణ కాకుండా మరో సెలబ్రెటీ కూడా ఉన్నారు. మరి వారెవరో మీరు గుర్తుపట్టారా? ఇంకా అర్థం కాలేదా? ఆయన పేరు చెప్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేనండి వేణు స్వామి. సెలబ్రెటీలకు ప్రత్యేక పూజలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎవరు ఎప్పుడు అనారోగ్యం పాలవుతారో.. ఎప్పుడు చనిపోతారో కూడా ఆయనే చెప్తారు.
రష్మిక, అషు రెడ్డి, నిధి అగర్వాల్ లాంటి వారు కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ స్వామి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సినిమా సెలబ్రెటీలకు పూజలు చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్స్ సమయంలో ప్రత్యేకం పూజలు చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ కు కూడా పూజ చేశారట వేణు స్వామి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అప్పటిదేనండోయ్. ఇక కృష్ణకే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాకు కూడా షూటింగ్ సమయంలో ప్రత్యేకం పూజలు చేశారట వేణుస్వామి. మొత్తం మీద అప్పటి ఫోటోలు ఇప్పుడు ఇలా వైరల్ గా మారితే భలే అనిపిస్తుంది కదా.. అయినా ఈ ఫోటోలు ఉన్నది వేణు స్వామి అని గుర్తుపట్టడం కూడా కష్టమే..