MLC kavitha- Liger: ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లాపడిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’..విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని వారం రోజులు తిరగకముందే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది..పాపం విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు..తన పీక్ కెరీర్ లోని మూడు సంవత్సరాల విలువైన కాల్ షీట్స్ ని పూరి జగన్నాథ్ ని నమ్మి ఇచ్చాడు..కానీ పూరి జగన్నాథ్ నిర్లక్షమైన టేకింగ్ వల్ల విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం పడిన కష్టం మొత్తం బూడిద లో పోసిన పన్నీరు లాగ అయిపోయింది పాపం..90 కోట్ల రూపాయిలు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా కి ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ కూడా రాకపోవడం గమనార్హం.
విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అవుతుంది అనుకుంటే..జెట్ స్పీడ్ లో వెళ్తున్న అతని కెరీర్ కి పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగ మారింది లైగర్ సినిమా..అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బయటపడి హాట్ టాపిక్ గా మారింది..అదేమిటి అంటే ప్రముఖ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్, లైగర్ సినిమాకి కెసిఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ ని పెట్టుబడిగా పెట్టిందని..కచ్చితంగా దీనిపై విచారణ జరిపి ఆమెపై చర్యలు తీసుకోవాలని సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేసాడు..ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కల్వకుంట్ల కవిత తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ ని వైట్ గా చేసుకునే ప్రక్రియ లో భాగంగా ఆమె టాలీవుడ్ లో నిర్మితమవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో పెట్టుబడి పెడుతుందని..ఆమె లేటెస్ట్ గా లైగర్ సినిమాకి పెట్టుబడులు పెట్టినట్టు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని బక్క జడ్సన్ ఈ సందర్భంగా సిబిఐ అధికారుకలకు ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా తో మాట్లాడారు..అయితే దీని పై కల్వకుంట్ల కవిత ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..కవిత గారి మీద కేవలం ఈ ఒక్క ఆరోపణే కాదు..రకరకాల ఆరోపణలతో ఆమె గత కొంత కాలం నుండి మీడియా లో లైమ్ లైట్ లో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు లేటెస్ట్ గా ఈ లైగర్ సినిమా వ్యవహారం ఆమెకి మరో కొత్త తలనొప్పిగా మారింది.
Also Read:Hari Hara Veeramallu: సోషల్ మీడియా లో లీకైన ‘హరి హర వీరమల్లు’ మూవీ ఇంటర్వెల్ సీన్