Mathu Vadalara: టాలీవుడ్ లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జానర్ లో సినిమాలు తెరకెక్కించడం ప్రముఖ దర్శకుడు రితేష్ రానా కి కొట్టినపిండి లాంటిది. ‘మత్తువదలరా’ చిత్రంతో ఆయన తన దర్శకత్వ ప్రతిభని బయటపెట్టిన సంగతి తెలిసింది. 2019 సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా కీరవాణి కొడుకు శ్రీ సింహా టాలీవుడ్ కి హీరో గా పరిచయం అయ్యాడు. తొలిసినిమాతోనే యాక్టింగ్ లో తన మార్కుని చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేసాడు కానీ, అవి కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘మత్తువదలరా 2’ చిత్రం తో మన ముందుకు వచ్చాడు. సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడం తో ఈ సినిమాపై విడుదలకు ముందు నుండే అంచనాలు భారీ గా ఉండేవి.
ప్రొమోషన్స్ కూడా విన్నూతన రీతిలో ప్లాన్ చేసారు. ప్రభాస్, రాజమౌళి వంటి వారు కూడా ఈ సినిమాకి డిఫరెంట్ స్టైల్ లో ప్రమోట్ చేసి జనాలకు మరింత రీచ్ అయ్యేలా చేసారు. అలా విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఒక సినిమాని చాలా కాలం తర్వాత ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చూస్తూ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకోవడం జరిగింది ఈ సినిమాకే అంటూ అందరూ రివ్యూస్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం లో నటించిన శ్రీ సింహా కంటే ఎక్కువగా, కమెడియన్ గా నటించిన సత్య కి మంచి పేరు వచ్చింది. టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ వచ్చేసాడని, బ్రహ్మానందం, సునీల్ ని మైమరపించే కమెడియన్ వచ్చేసాడని, ఇక సత్య కి తిరుగులేదని అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తేసారు. ఈ చిత్రానికి ముందే సత్య కి కమెడియన్ గా మంచి పేరుంది.
ఈ చిత్రం తర్వాత ఆయన ఇమేజి పదింతలు ఎక్కువ అయ్యింది. సత్య కి ఇంతటి క్రేజ్ ని తెచ్చిపెట్టిన ఈ సినిమాలో, మొదటి ఛాయస్ గా ఆయనని అనుకోలేదట డైరెక్టర్ రితేష్ రానా. ఆయనకీ బదులుగా భరత్ ని ఆ క్యారక్టర్ కోసం ముందుగా అనుకున్నాడట. భరత్ అంటే ఎవరో కాదు, ఢీ, రెడీ, వెంకీ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మాస్టర్ భరత్ అనే కుర్రాడే ఇతను. పెద్దయ్యాక కమెడియన్ గా పలు సినిమాల్లో నటించాడు కానీ, ఎందుకో ఆయనకీ బాలనటుడిగా ఉన్నప్పుడు వచ్చిన గుర్తింపు పెద్దయ్యాక రాలేదు. ఒకవేళ మత్తువదలరా సిరీస్ లో నటించి ఉండుంటే భరత్ కి కావాల్సిన గుర్తింపు లభించేది ఏమో అని సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ తెలుసుకున్న నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.