Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఈ నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసిన ఇప్పుడు ‘దేవర’ చిత్రం మేనియా నే కనిపిస్తుంది. ఓవర్సీస్ లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా కేవలం నార్త్ అమెరికా నుండే 1.3 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్ షోస్ మొదలయ్యే సమయానికి రెండు మిలియన్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 22 వ తారీఖున హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవ్వబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్స్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదా లో పూర్తిగా సహకరించినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే మేకర్స్ పవన్ కళ్యాణ్ ని కలిసి టికెట్ రేట్స్ గురించి చర్చించగా ఆయన చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయనని వెంటనే జీవో సిద్ధం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశించాడట. అలా టికెట్ రేట్స్ సులువుగా ‘దేవర’ చిత్రానికి పెంచుకునేందుకు అనుమతిని ఇప్పించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి ‘దేవర’ చిత్రాన్ని ఆశీర్వదించాలని మేకర్స్ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ సమయం చూసుకొని అనుకూలిస్తే కచ్చితంగా వస్తాను అని మాట ఇచ్చాడట. ఒకవేళ వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వీరాభిమానులు హైదరాబాద్ శిల్ప కళా వేదిక వద్దకు వచ్చేస్తారని అంటున్నారు. మరోపక్క ఈ ఈవెంట్ కి మహేష్ బాబు కూడా వస్తాడని టాక్.
ఒకేసారి ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే వేదిక మీద కనిపిస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా ముంబై లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. కాసేపటి క్రితమే సందీప్ రెడ్డి వంగ దేవర టీం తో చేసిన ఇంటర్వ్యూ ని విడుదల చేయగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దేవర చిత్రం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ లో తెలిపారు. మూవీ స్టోరీ లైన్ కూడా సైఫ్ అలీ ఖాన్ మొత్తం లీక్ చేసేసాడు. ట్రైలర్ లో చూపించినట్టు ఉండదని, కచ్చితంగా ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు చాలా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.