https://oktelugu.com/

Trivikram Srinivas: త్రివిక్రమ్ ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన ఆ లేడీ రైటర్ ఎవరో తెలుసా..?

త్రివిక్రమ్ స్టాండర్డ్ తగ్గిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఆయన మీద భారీ ఎత్తున ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా త్రివిక్రమ్ కి కథలు రాసుకునే సత్తా లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 17, 2024 / 07:17 PM IST
    Follow us on

    Trivikram Srinivas: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ రైటర్ గా ఒక సినిమా వస్తుంది అంటే చాలు జనాల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అయ్యేది. ఇక మొదటి రోజు నుంచే ఆ సినిమాని చూడడానికి జనాలు ఆసక్తి చూపిస్తూ ఉండేవారు.

    ఇక ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు చాలా సక్సెస్ లను అందుకున్నాడు. అలాగే డైరెక్టర్ గా మారి తనదైన రీతిలో సినిమాలు తీసి భారీ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఆ విషయం గుంటూరు కారం సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ది జనాలకి నచ్చలేదు. కారణం ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ లేదు అలాగే రొటీన్ స్టోరీ తో సాగే సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పోయింది.

    దాంతో త్రివిక్రమ్ స్టాండర్డ్ తగ్గిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఆయన మీద భారీ ఎత్తున ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా త్రివిక్రమ్ కి కథలు రాసుకునే సత్తా లేదు. ఆయన యద్దనపూడి సులోచన రాణి గారి నవలలను అటు ఇటు తిప్పుతూ స్టోరీ రాసుకొని దాన్ని సినిమాగా చేసి సక్సెస్ లు కొడుతూ ఉంటాడు అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే యద్దనపూడి గారు లేకపోవడం తో ఆయనకి కథ సరిగ్గా దొరకడం లేదు ఆమె ఉండి ఉంటే ఇప్పటికి రెండు మూడు నవలలను రిలీజ్ చేసినట్లయితే వాటి నుంచి కొన్ని క్యారెక్టర్ లని ఎత్తేసి ఒక కథ రాసుకొని సినిమాగా తీసి సక్సెస్ అయ్యేవాడు అంటూ పలువురు సినిమా విమర్శకులు సైతం త్రివిక్రమ్ మీద విమర్శలు చేస్తున్నారు…

    ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో ఎలాగైనా తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాతో కనక ఆయన ప్రూవ్ చేసుకోకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అవ్వడానికి రెడీ గా ఉన్న డైరెక్టర్లలో త్రివిక్రమ్ కూడా చేరిపోతాడనే చెప్పాలి…