Rajamouli: సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక వాళ్ళ ఇంట్లో సినిమా కి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ లా వాళ్లు ఉండడం విశేషం…వీళ్లే రాజమౌళి సినిమాకి సగం పనులు పూర్తి చేసి పెడతారు. అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ల ఫ్యామిలీని వాడుకుంటూ రాజమౌళి మంచి సక్సెస్ లను అందుకుంటూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే పాన్ వరల్డ్ సినిమాతో మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళి వాళ్ళ ఇంట్లో రాజమౌళి తో పాటుగా వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా డైరెక్టర్ గా కొన్ని సినిమాలను చేశాడు. అయినప్పటికీ ఆయన డైరెక్టర్ గా అంత సక్సెస్ ఫుల్ గా కొనసాగ లేకపోయాడు. ఇక దాంతో రైటర్ గా మాత్రమే స్థిరపడ్డాడు. ఇక వీళ్లిద్దరే కాకుండా వీళ్ళ ఇంట్లో మరొక డైరెక్టర్ కూడా ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.
ఆయన ఎవరు అంటే కీరవాణి తమ్ముడు అయిన కాంచీ గారు. ఈయన రాజమౌళికి అన్నయ్య అవుతాడు అయితే రాజమౌళి చదువుకుంటున్న సమయం లో కాంచీ కొన్ని కథలను చెబుతూ రాజమౌళి తో సినిమాలను ఇలా తీయాలి, అలా తీయాలని భారీ రేంజ్ లో చెప్తూ ఉండేవాడట. ఇక ఇంట్లో వాళ్ళందరూ కాంచీ పెద్ద డైరెక్టర్ అవుతాడని అనుకున్నారు. అలాగే ఆయన ఆ తర్వాత అమృతం సీరియల్ లో కూడా కొన్ని ఎపిసోడ్లకు డైరెక్షన్ చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక దాంతో ఆయన డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అవుతాడు అని అనుకున్నారు.
ఇక ఆయన డైరెక్షన్ లో కొన్ని సినిమాలు స్టార్ట్ చేసినప్పటికి అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలు షూటింగ్ దశల్లోనే ఆగిపోయాయి. ఇక దాంతో ఇప్పుడు ఆయనకి డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ లేక రాజమౌళి సినిమాలకే చాలావరకు హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. ఇక అలాగే బయట డైరెక్టర్లకు కూడా కొన్ని కథలను ఇస్తూ వస్తున్నాడు. ఇక రాజమౌళి సునీల్ ని హీరోగా పెట్టి చేసిన మర్యాద రామన్న సినిమాకి కథ అందించింది కూడా కాంచీ గారే కావడం విశేషం…అలాగే మరి కొంత మంది బయట డైరెక్టర్లకు కూడా కథలను ఇస్తూ వస్తున్నాడు…