https://oktelugu.com/

Heroine: చిరంజీవి పక్కన తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రేమికులుగా,అన్న చెల్లెలిగా, తల్లి కొడుకులుగా కనిపించి అందరిని అలరించారు. హిందీలో సూపర్ హిట్ అయినా ముకందర్ క సికందర్ అనే సినిమా తెలుగులో పునర్నిర్మాణమే ప్రేమతరంగాలు అనే టైటిల్ తో తెరకెక్కింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 25, 2023 5:39 pm
    Follow us on

    Heroine: సిని ఇండస్ట్రీలో ఏ పాత్రను అయినా ఇట్టే చేసే టాలెంట్ ఉండాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోవాలి, జీవించాలి. ఒక పాత్రను మాత్రమే చేస్తాను అంటే కుదరదు. అయితే ఒక పాత్రను ఒక హీరోతో చేస్తే.. మరో సినిమాలో మరో పాత్ర వేయవచ్చు. అలా సినిమాలు, కథలు మారిన కొద్ది హీరోహీరోయిన్ మధ్య బంధం కూడా మారుతూ ఉంటుంది. అలంటి విచిత్రమైన కలయిక చిరంజీవి, సుజాతాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి సినిమా కెరీర్ మొదలైనప్పటి నుంచి ఒక్కో సందర్భంలో ఒక్కో కలయికతో కనిపించరు.

    ప్రేమికులుగా,అన్న చెల్లెలిగా, తల్లి కొడుకులుగా కనిపించి అందరిని అలరించారు. హిందీలో సూపర్ హిట్ అయినా ముకందర్ క సికందర్ అనే సినిమా తెలుగులో పునర్నిర్మాణమే ప్రేమతరంగాలు అనే టైటిల్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రలో కృష్ణం రాజు,వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి, రాఖి పాత్రలో సుజాత నటించారు. ఈ చిత్రంలో చిన్న పిల్లవాడు విజయ్ రంగారావు అనే సంపన్నుడి దగ్గర పని చేస్తూ ఉంటాడు. రంగారావు చిన్నకూతురు సుజాత కు ఆ పిల్లవాడికి మధ్య స్నేహం ఏర్పడుతుంది.

    చిరంజీవి, సుజాత అన్నా చెల్లెల్లుగా కూడా నటించారు. 1982 లో రిలీజ్ అయినా సీతాదేవి సినిమాలో ఈ విధంగా నటించారు ఇద్దరు స్టార్లు. ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్న చెల్లెలి కథ చుట్టూ తిరుగుతుంది. ఇదిలా ఉంటే.. విజయబాపినీడు దర్శకత్వం వహించిన బిగ్ బాస్ అనే చిత్రంలో తల్లికొడుకులుగా నటించారు. ఈ సినిమా 1995 లో రిలీజ్ అయ్యింది. ఇలా మొత్తం మీద చిరంజీవి సుజాత ప్రేమతరంగాలు అనే చిత్రంలో ప్రేమికులుగా,సీతాదేవి అనే చిత్రంలో అన్న చెల్లెలిగా,ఆ తర్వాత బిగ్ బాస్ చిత్రంలో తల్లి కొడుకులుగా నటించారు.