Pokiri Movie: ‘పోకిరీ’ మిస్ చేసుకున్న ఆ హీరో/విలన్.. చేసి ఉంటే ఇప్పుడు వేరే లెవల్ లో ఉండేవాడు

వైష్షో అకాడమీ బ్యానర్ పై 2006 ఏప్రిల్ 27న థియేటర్లోకి వచ్చిన ‘పోకిరి’ని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు అటు పూరి జగన్నాథ్, ఇటు మహేష్ బాబులు వరుస ప్లాపులతో ఉన్నారు. కొన్ని రోజుల తరువాత ఈ మూవీ గురించి తెలిసి ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టారు. అప్పటికీ సినిమాలు కష్టంగా నడుస్తున్న సమయంలో ఈ మూవీ 100 రోజులకు పైగా నడిచి అశ్చర్యపరిచింది. అంతేకాకుండా కేవం రూ.12 కోట్లతో తీసిన ఈ మూవీ 70 కోట్ల వరకు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

Written By: Chai Muchhata, Updated On : July 13, 2023 11:44 am

Pokiri Movie

Follow us on

Pokiri Movie: తెలుగు ఇండస్ట్రీలో 2006 సంవత్సరం వరకు ఎన్నో సినిమాల్లో రికార్డులు తిరగరాశాయి. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’ అప్పటి వరకు ఉన్న రికార్డులను దాటేసింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కావడమే కాకుండా కలెక్షన్లలోనూ దూసుకుపోయింది. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ గురించి చెప్పేటప్పుడు పోకిరికి ముందు.. పోకిరి తరువాత అని చెప్పుకుంటారు. ఈ సినిమాతో అటు మహేష్ బాబు.. ఇటు పూరి జగన్నాథ్ కెరీర్ మరోసారి మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ముందుగా పవన్ కల్యాణ్ ను చేయాలని అడిగారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఒప్పుకోకపోవడంతో మహేష్ చేయాల్సి వచ్చింది. ఇక హిందీలో రీమేక్ చేసేటప్పుడు ఓ పాన్ ఇండియా నటుడిని అడిగారట. కానీ ఆయన కూడా ఒప్పుకోకపోవడంతో సల్మాన్ ఖాన్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా?

వైష్షో అకాడమీ బ్యానర్ పై 2006 ఏప్రిల్ 27న థియేటర్లోకి వచ్చిన ‘పోకిరి’ని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు అటు పూరి జగన్నాథ్, ఇటు మహేష్ బాబులు వరుస ప్లాపులతో ఉన్నారు. కొన్ని రోజుల తరువాత ఈ మూవీ గురించి తెలిసి ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టారు. అప్పటికీ సినిమాలు కష్టంగా నడుస్తున్న సమయంలో ఈ మూవీ 100 రోజులకు పైగా నడిచి అశ్చర్యపరిచింది. అంతేకాకుండా కేవం రూ.12 కోట్లతో తీసిన ఈ మూవీ 70 కోట్ల వరకు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

భారీ యాక్షన్ తో వచ్చిన ఇందులో మహేష్ బాబు ఫస్ట్ టైం ఆల్ టైం మాస్ హీరోగా కనిపించాడు. సినిమా స్టోరికి అనుగుణంగా ఆయన యాక్షన్ అదిరిపోవడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా లవ్, కామెడీ సీన్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ మూవీని వివిధ భాషల్లో రీమేక్ చేశారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘వాంటెట్’ పేరుతో రీమేక్ చేశారు. ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అక్కడా హిట్టు కొట్టింది. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ కు బదులు మరో నటుడిని అనుకున్నారట.

ఆయనే సోనూసుద్. సినిమాల్లో మొదట్లో విలన్ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సోనూసుద్ రియల్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఆయనను సినిమాల్లో హీరోగా చూపించాలని అనుకున్నారు. ఇందులో భాగంగా పోకిరి రీమేక్ లో నటించాలని అడగగా సోనూసుద్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఒకవేళ సోనూసుద్ పోకిరీ హిందీ మూవీ చేసి ఉంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లెవల్లో హీరోగా ఎదిగిపోయేవాడని అంటున్నారు.