Rashmika Mandanna: సౌత్ బ్యూటీ రష్మిక ఇప్పుడున్న ట్రెండీ హీరోయిన్లలో ఒకరు. కొత్త హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో హవా సాగిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తున్న ఈ అమ్మడు లక్కీ హ్యాండ్ అని పేరు తెచ్చుకుంది. అందుకే ఆమెతో ఒక్క సినిమా అయినా తీయాలని చాలా మంది హీరోలు, డైరెక్టర్లు ఆశపడుతున్నారు. అయితే రష్మిక మాత్రం సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తోంది. లాస్ట్ లో పుష్ప మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఇప్పుడు అదే మూవీ పార్ట్ 2లో సీరియస్ గా నటిస్తోంది. ఇందులో రష్మిక డిఫరెంట్ రోల్ ఉంటుందని, చనిపోతుందని రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా చూసేవరకు ఏ విషయం చెప్పలేం.
సినిమాల్లో ఎంత బిజీ ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తన అందాలన్నీ మీకోసమే అన్నట్లు గ్లామర్ షో చేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ యూత్ కు మతిపోయే విధంగా ప్రవర్తిస్తున్న రష్మిక కు సంబంధించిన ఓ హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ భామ సినిమాల్లోకి వచ్చి 7 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో ఆమె కన్నడ, తమిళం, తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో నటించింది. మరీ ఇంతకాలంలో రష్మిక ఏమాత్రం సంపాదించింది? ఆమెకున్నఆస్తులేంటి? అనే విషయాలపై తెగ చర్చించుకుంటున్నారు.
కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిక మందాన చదువు పూర్తయిన తరువాత 2014లో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. మొదట్లో షాంపు యాడ్ లో నటించింది. ఇందులో తన అందంతో మెరిసిపోవడంతో శాండల్ వుడ్ వారు రష్మికను సినిమాల్లోకి తీసుకోవాలని అనుకున్నారు. దీంతో ఆమెకు 2016లో కన్నడ మూవీ ‘కిరాక్ పార్టీ’ అనే మూవీలో అవకాశం ఇచ్చారు. ఈ మూవీ యావరేజ్ హిట్టు కొట్టినా రష్మిక నటనకు మాత్రం 100 మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. అలా తెలుగులో ‘ఛలో’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ హిట్టు కొట్టడంతో అమెకు ఇక్కడ అవకాశాల దారులు పట్టాయి.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ హీరోయిన్లలో రష్మిక మాత్రమే అని చెప్పొచ్చు. ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు అడ్డర్టయిజ్మెంట్లతో బిజీగా మారిన ఈమె రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఆమె లగ్జరీ ఐటమ్స్ ఎక్కువగా కొనుగోలు చేసింది. ఆమకు మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ కారు ఉంది. దీనిని రూ.50 లక్షలతో కొనుగోలు చేసింది. దీంతో పాటు ఆడి క్యూ 3 కారు కూడా ఉంది. రీసెంట్ గా టయోటా ఇన్నోవా హుండై క్రెటా కార్లను కూడా కొనుగోలు చేసింది.
రష్మికకు హ్యాండ్ బ్యాగ్స్ అంటా చాలా ఇష్టం. దీంతో ఆమె బ్రాండెడ్ బ్యాగ్ ను రూ.3 లక్షలతో కొనుగోలు చేసింది. ఇక బెంగుళూరులో రూ.8 కోట్ల బంగ్లా ఉన్న ఆమె ముంబైలో ఇటీవల ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది. ఇక ముంబై టు హైదరాబాద్ ఎక్కువగా ట్రావెల్ చేస్తున్న రష్మిక ఎప్పుడు ఏ కారు వాడుతుందో తెలియదట.