Do you know who is that director who wrote a story in just 11 days
Tollywood: కొంతమంది డైరెక్టర్లు చాలా రోజులపాటు కథలను రాస్తు వాటిని చెక్కుతూ ఉంటారు. కథల కోసమే దాదాపు ఒకటి రెండు సంవత్సరాలు తీసుకొని దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్ గా మారుస్తారు. అలా చేసిన సినిమాలు కూడా కొన్నిసార్లు డిజాస్టర్లు అవుతూ ఉంటాయి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ మాత్రం ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు తీసుకోడట..
మహా అయితే ఆయన పది రోజుల్లోనే ఒక సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తాడు. 11 రోజుల్లోనే పోకిరి సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని రాసిన పూరి జగన్నాథ్ ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం విశేషం…ఆయనకి ఎక్కువ రోజులు ఒకే స్టోరీ మీద ట్రావెల్ చేయడం అంటే ఇష్టం ఉండదట..దానివల్లే ఆ సినిమా స్టోరీని తొందరగా కంప్లీట్ చేసి తొందరగా షూట్ చేసి రిలీజ్ చేస్తాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో ఆయన ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నాడు.
అందులో కొన్ని సూపర్ సక్సెస్ అయితే, మరికొన్ని డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఇక పూరి ఫ్లాప్ సినిమా తీసిన, హిట్టు సినిమా తీసిన గానీ ఒక సినిమా కోసం ఆయన కేటాయించే రోజులు మాత్రం అంతేనని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక మొత్తానికైతే చాలా తక్కువ రోజుల్లో సినిమాలను తీసి ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టాలో పూరి జగన్నాథ్ కి తెలిసినంత బాగా మరేవరికి తెలియదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఆయన ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…మరి ఈ సినిమా తో సక్సెస్ కొట్టి పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి…