https://oktelugu.com/

WPL 2024: బెంగళూరు గెలుపు.. ఆమెకు గుడి కట్టినా తప్పులేదు బ్రో

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫెర్రీ పేరు మార్మోగిపోతుంది. బెంగళూరు కప్ సాధించడానికి కారణమైన ఆమెకు గుడి కట్టినా తప్పులేదు బ్రో అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. "ఆమె బెంగళూరు జట్టు అద్భుతం. గొప్ప ఆట తీరుతో ఆకట్టుకుంది.

Written By: , Updated On : March 18, 2024 / 12:22 PM IST
WPL 2024

WPL 2024

Follow us on

WPL 2024: విజయం ఎంతటి కిక్ ఇస్తుందో.. అది ఎంతటి అనుభూతినిస్తుందో.. ఇప్పుడు బెంగళూరు జటను చూస్తే తెలుస్తుంది. అటు ఐపీఎల్ లో ఇంతవరకు పురుషుల జట్టు ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకోలేదు. గత ఏడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలైతే.. స్మృతి ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు అత్యంత దారుణమైన ఆట తీర్ ప్రదర్శించింది. దీంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రెండవ సీజన్లోనూ అంతంతమాత్రంగానే ఆడినప్పటికీ.. ఎలిమినేటర్ మ్యాచ్లో సత్తా చాటి బెంగళూరు ఫైనల్ వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీని మట్టికరిపించి కప్ దక్కించుకుంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎలీస్ ఫెర్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. బెంగళూరు జట్టును గెలిపించింది. ఫైనల్ మ్యాచ్ లోనూ ఢిల్లీపై 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ నేపథ్యంలో ఫెర్రీ పేరు మారుమోగిపోతోంది. అసలే అందగత్త కావడంతో నెటిజన్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మా జట్టు పాలిట అదృష్ట దేవత అంటూ కొనియాడుతున్నారు. వాస్తవానికి ఈ టోర్నీలో ఫెర్రీ అద్భుతంగా ఆడింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబైపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఫైనల్ మ్యాచ్లో 35 పరుగులు చేసింది. ఉత్తర ప్రదేశ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో బంతిని బలంగా కొడితే టాటా కారు అద్దం బద్దలైపోయింది. ఈ టోర్నీలో ఫెర్రీ 347 పరుగులు చేసింది. ఏకంగా ఆరెంజ్ క్యాప్ తో పాటు ఐదు లక్షల నగదు బహుమతి అందుకుంది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫెర్రీని బెంగళూరు అభిమానులు కొనియాడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫెర్రీ పేరు మార్మోగిపోతుంది. బెంగళూరు కప్ సాధించడానికి కారణమైన ఆమెకు గుడి కట్టినా తప్పులేదు బ్రో అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “ఆమె బెంగళూరు జట్టు అద్భుతం. గొప్ప ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ సీజన్లో 347 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు సగర్వంగా నేడు నిలబడిందంటే దానికి ఫెర్రీ కారణమంటూ” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.