https://oktelugu.com/

Dasari Narayana Rao: దాసరి గారికి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

దాసరి గారు నాగేశ్వరరావుకి చాలా మంచి విజయాలను అందిస్తే, రాఘవేంద్రరావు ఎన్టీయార్ తో సినిమాలు చేసి ఆయనకు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లని అందించాడు.

Written By: , Updated On : February 29, 2024 / 12:02 PM IST
Dasari Narayana Rao favorite hero
Follow us on

Dasari Narayana Rao: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీయార్(NTR), నాగేశ్వరరావు(ANR), కృష్ణ(Krishna), శోభన్ బాబు(Shoban Babu) లాంటి స్టార్ హీరోలు ఎనలేని సేవలను అందించారు. వీళ్ళ వల్లే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఈ రేంజ్ లో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో చాలా మంది డైరెక్టర్లు మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. అందులో దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు లాంటి దర్శకులు ప్రముఖులు. ఇక దాసరి గారు నాగేశ్వరరావుకి చాలా మంచి విజయాలను అందిస్తే, రాఘవేంద్రరావు ఎన్టీయార్ తో సినిమాలు చేసి ఆయనకు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లని అందించాడు.

ఇక ఈ ఇద్దరు డైరెక్టర్ల మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది అందులో ఒకసారి ఒకరు సక్సెస్ అయితే, మరొకసారి మరొకరు విజయాన్ని సాధించేవారు. ఇక ఇదిలా ఉంటే దాసరి గారు ఎన్టీఆర్, నాగేశ్వరావు ఇద్దరితో సినిమాలు చేస్తూనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే దాసరి గారికి నాగేశ్వరరావు అంటే మాత్రం అమితమైన అభిమానం ఉండేదట. ఆయన సినిమాలను చూసే తను కూడా ఇండస్ట్రీకి రావాలని అనుకున్నాడట. ఇక ఎన్టీఆర్ ని చూసి క్రమశిక్షణతో ఎలా మెదలాలి అనేది నేర్చుకున్నాడట. ఇలా ఇద్దరు హీరోలతో పని చేయడం కూడా తనకు ఒక వరమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు.

ఇక 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక ఇండియన్ డైరెక్టర్ గా కూడా దాసరి గారు గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఆయన తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తుతూ దానిమీద సెటరీకల్ గా సినిమాలను తీసేవాడు. ఇక కొన్ని సినిమాల్లో అయితే రాజకీయ నాయకులను ఉద్దేశించి చాలా పాటలను కూడా పెట్టేవాడు…

ఇక ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీలో లేకపోవడం తీరని లోటనే చెప్పాలి. మనకైతే దాసరి గారు సినిమా ఇండస్ట్రీలో చాలా కీలకపాత్ర వహించారనే చెప్పాలి. ఇక ఆయన ఇండస్ట్రీ పెద్దగా కూడా చాలా చిన్న సినిమాలకి, చిన్న సినిమాలకి బాసటగా నిలిచిన విషయం మనకు తెలిసిందే…