Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈయన నటించే సినిమాలు మంచి సక్సెస్ ను సాధిస్తాయి. ఇక ఈయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతుంటారు. ఘట్టమనేని మహేష్ బాబు తండ్రి వారసత్వంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఏ స్టార్ కు అయినా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం తప్పదు. అయితే మహేష్ ఖాతాలో కూడా కొన్ని ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే వాటికి కారణం ఏంటో తెలుసా?
మహేష్ బాబు సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా సులువుగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఒక సెంటిమెంట్ వల్ల ఆయన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయట. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. అమ్మ.. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు మూడు కూడా సక్సెస్ సాధించలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంటే అమ్మ సెంటిమెంట్ మహేష్ కు కలిసి రావడం లేదంటున్నారు అభిమానులు.
ఈయన కెరీర్ లో అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన మొదటి సినిమా నిజం. ఈ సినిమాలో భర్త మరణించడంతో భార్య కొడుకుకు ట్రైనింగ్ ఇచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావిస్తుంది. నిజం సినిమా బాగానే ఉన్నా కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేక పోయింది. ఈ సినిమాలోని పాటలకు ఆర్పీ పట్నాయక్ వాయిస్ కూడా మైనస్ అయిందనే చెప్పాలి. తర్వాత రోజుల్లో మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమా నాని.
ఎస్. జె. సూర్య డైరెక్షన్ లో అమీషా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. తాజాగా మహేష్ బాబు నటించి విడుదలైన గుంటూరు కారం సినిమా కూడా అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.
సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు అభిమానులలో సైతం చాలా మందికి నచ్చలేదు. అమ్మ సెంటిమెంట్ మహేష్ బాబుకు అచ్చిరాలేదని అంటున్నారు నెటిజన్లు. మహేష్ బాబు భవిష్యత్తులో ఈ తరహా కాన్సెప్ట్ లకు దూరంగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు ఆయన అభిమానులు.