Mahesh Babu: అక్క బ్యానర్ లో మహేష్ బాబు సినిమా ఎందుకు చేయడం లేదు?

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించి మేకోవర్ లో మహేష్ బాబు రెడీ అయినప్పటికీ రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

Written By: Swathi, Updated On : February 29, 2024 12:13 pm
Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. రాజకుమారుడు సినిమాతో హిట్ ను సొంతం చేసుకున్న ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి వరుస విజయాలను సాధిస్తూ.. ఇప్పటికీ స్టార్ హీరోగా నిలుస్తున్నాడు మహేష్. తండ్రి మాదిరి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా 28 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ వాళ్ల అక్క ఇందిరా ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించింది. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు ఆ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ మహేష్ బాబు ఒక సినిమా చేసి ఆమెకు సక్సెస్ ఇస్తే బాగుంటుందని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ బ్యానర్ కి కూడా వీళ్ల అమ్మ ఇందిరా పేరు పెట్టడం వల్ల ఆమె పరువు ప్రతిష్టలు పోకుండా ఉండాలంటే ఒక్కసారైనా మహేష్ అక్క బ్యానర్ లో సినిమాలు చేయాలి అంటున్నారు ఆయన అభిమానులు.

అక్కకి ఒక్క సక్సెస్ ఇస్తే ఆమెకు కూడా మంచి కెరీర్ ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అయితే ఇప్పటికే నెపోటిజం అనే పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. తమ్ముడి వల్లే సక్సెస్ సాధించింది లేదంటే చాలా కష్టం అనే పేరు అక్కకి రావద్దనే మహేష్ ఆ నిర్ణయం తీసుకోవడం లేదా అంటూ కొందరు అడుగుతున్నారు. మరి మిల్క్ స్టార్ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే కష్టమే..

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించి మేకోవర్ లో మహేష్ బాబు రెడీ అయినప్పటికీ రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అందువల్ల ఈ సినిమాకు మరి కొద్ది రోజుల టైమ్ పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.