Homeఎంటర్టైన్మెంట్South Heroines: 5 భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో మెప్పించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ లు...

South Heroines: 5 భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో మెప్పించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ లు ఎవరో తెలుసా?

South Heroines: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఎంతో మంది ఇప్పుడు స్టార్ లుగా కొనసాగుతున్నారు. ఇక టాలీవుడ్ కాకుండా సౌత్ పరిశ్రమ మొత్తంగా చూసుకుంటే ఎంతో మంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ లు ఇప్పుడు బాలీవుడ్ ను ఏలేస్తున్నారు. అక్కడ పెద్ద హీరోల సరసన నటిస్తూ బాలీవుడ్ బ్యూటీలను కూడా వెనక్కి నెట్టేస్తున్నారు. అంటే ప్రజెంట్ సౌత్ బ్యూటీస్ క్రేజ్ మామూలుగా లేదన్నమాట. ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ క్రేజీ సినిమా చూసినా అందులో సౌత్ బ్యూటీ ఉండాల్సిందే అన్న చందంగా మారింది.రీసెంట్ గా వచ్చిన ఐదు భారీ ప్రాజెక్ట్ లో కూడా మన సౌత్ బ్యూటీస్ ఉండడం గమనార్హం. మరి ఆ ఐదు సినిమాలు ఏంటి? అందులో నటించిన మన సౌత్ ఇండియన్ స్టార్లు ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం..

నయనతార – జవాన్..రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమా బిగ్గెస్ట్ మూవీ. ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈయనకు జోడీగా నయనతార మెప్పించింది. ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రను పోషించారు. ఇలా బాలీవుడ్ హీరో సరసన నయన్ హీరోయిన్ గా నయన్ నటించడం ఇదే మొదటిసారి. షారుఖ్ రీసెంట్ సినిమా పఠాన్ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అదే రేంజ్ లో జవాన్ కూడా హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నయనతార నటించడం ఆమెకు మరింత ప్లస్ అనే చెప్పాలి. ఈ అమ్మడు రేంజ్ ను ఫుల్ గా పెంచింది జవాన్ సినిమా.

రష్మిక-యానిమల్
పుష్ప సినిమాతో అమాంతం తన క్రేజ్ పెంచేసుకుంది అందాల తార రష్మిక మందన. సౌత్ లో ఈ సినిమాతో అమ్మడు రేంజ్ పెరగడంతో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా రష్మికనే హీరోయిన్. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యాక్షన్ లవ్ స్టోరీ యానిమల్. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి సూపర్ అనిపించుకుంది. అయితే ఈమె పాత్ర ఇందులో డిఫరెంట్ గా రెబల్ గా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా హిట్ తో రష్మిక రేంజ్ మరింత పెరిగింది.

అమలాపాల్..భోళా
యాక్షన్ థ్రిల్లర్ సినిమా భోళా లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తే..స్వీయ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. అయితే తమిళ సూపర్ హిట్ సినిమా ఖైదీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పెరోల్ పై విడుదలైన ఓ ఖైదీ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు. అనేదే కథాంశం. ఒరిజినల్ వెర్షన్ లో చాలా మార్పులు చేసి హిందీ వెర్షన్ భోళా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ అమలాపాల్ నటించి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే బాలీవుడ్ లో నటించడం అమలాపాల్ కు కెరీర్ పరంగా అడ్వాంటేజ్ అయింది.

సమంత-ఫ్యామిలీ మ్యాన్ 2..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ లో ఇదే వెబ్ సిరీస్ లో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించింది. యాక్షన్ సీక్వెన్స్ లతో జనాన్ని థ్రిల్ చేసిన ఈ సిరీస్ మంచి హిట్ ను సొంతం చేసుకుంది.

పూజా హెగ్డే-కిసీకా బాయ్ కిసీకీ జాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్లూభాయ్ లేటెస్ట్ మూవీ ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’. ఫర్హాన్ సమ్ జీ దీనికి డైరెక్టర్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా క్రేజీ సౌత్ బ్యూటీ పూజా హెగ్డే నటించి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పూజా బాలీవుడ్ లో మంచి సక్సెస్ ను సాధించిందనే చెప్పాలి. అయితే సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో వరుస సినిమాలు, భారీ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా.. టాలీవుడ్, సౌత్ లో సక్సెస్ అయిన రాశిఖన్నా, రకుల్ ప్రీత్.. లాంటి భామలు కూడా ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version