https://oktelugu.com/

Celebrity Weddings: 2023 లో పెళ్లి పీటలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు వీళ్లే…

మెగా ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన వరుణ్ తేజ్ సినిమాల పరంగా ఇన్ని రోజులపాటు బిజీ బిజీ గడుపుతూ సినిమాలు చేస్తు మంచి విజయాలను అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2023 / 04:16 PM IST

    Celebrity Weddings

    Follow us on

    Celebrity Weddings: 2023 సంవత్సరంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ఇప్పటివరకు సినిమాల బిజీ లో ఉండే పర్సనల్ లైఫ్ ని కొంచెం డిలే చేసుకుంటూ వచ్చిన సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఇప్పుడు పెళ్లి బాట పట్టడం అనేది ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి అయితే ఈ సంవత్సరంలో పెళ్లిళ్లు చేసుకున్న కొంతమంది సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కైరా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా

    వీళ్ళిద్దరి జోడి స్క్రీన్ మీద చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా షేర్షా సినిమా టైంలో వీళ్లిద్దరి మధ్య అనుబంధం ప్రేమకి దారితీసి పెళ్లి దాకా నడిచే విధంగా చేసింది. ఇక వీళ్ళ పెళ్లి జైసల్మేర్ లోని ఓ స్టార్ హోటల్ కమ్ రిసార్ట్ లో 3 రోజుల పాటు అంగ రంగ వైభవంగా జరిగింది. చాలా రోజుల నుంచి డేట్ లో ఉన్న వీళ్ళు ఈ ఇయర్ పెళ్లి బంధం తో ఒకటయ్యారు…

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

    మెగా ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన వరుణ్ తేజ్ సినిమాల పరంగా ఇన్ని రోజులపాటు బిజీ బిజీ గడుపుతూ సినిమాలు చేస్తు మంచి విజయాలను అందుకున్నాడు. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ అనే సినిమా లో లావణ్య త్రిపాఠి తో కలిసి నటించడం వల్ల వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఆ తర్వాత ప్రేమ చిగురించింది.అలా ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘం గా ప్రేమించుకున్నాక వీళ్లిద్దరూ ఈ సంవత్సరం పెళ్లి తో ఒకటయ్యారు…

    శర్వానంద్ రక్షిత రెడ్డి

    మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శర్వానంద్ ఆ తరువాత హీరో గా మారి మంచి విజయాలను అందుకున్నాడు నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి ముఖ్యంగా వెన్నెల, గమ్యం,ప్రస్థానం, రన్ రాజా రన్ లాంటి సినిమాలు ఆయనకి మంచి పేరు తీసుకువచ్చాయి. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన పెళ్లి పీటలు ఎక్కారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రక్షిత రెడ్డి ని తను వివాహం చేసుకున్నాడు…

    పరిణితి చోప్రా ఎంపి రాఘవ్ చద్ద…

    బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పరిణీతిచోప్రా… ఇక ఈమె ఎంపి రాఘవ్ చద్ద ని పెళ్లి చేసుకుంది.అయితే వీళ్లిద్దరూ లండన్ లో కలిసి చదువుకున్నారు ఒకరిమీద ఒకరికి మంచి అభిప్రాయం ఉండటం తో ఇద్దరు పెళ్లి కి అంగీకరించి పెళ్లి చేసుకొని ఒకటైయ్యారు…

    ఇలియానా మైకేల్ డోలన్…

    ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఇలియానా అప్పట్లో చాలా సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకుంది. అయితే ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు మైకేల్ డోలన్ అని తెలుస్తుంది. అయితే తను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం తను గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టు గా తెలుస్తుంది…