Animal: అనిమల్ కి అమీర్ ఖాన్ మాటలను జత చేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న బాలీవుడ్ జనాలు…

బాలీవుడ్ జనాలు కొందరు అనిమల్ సినిమాకి యాడ్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఒక తెలుగు వాడు బాలీవుడ్ లో అంత పెద్ద సక్సెస్ కొట్టడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేక ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : December 15, 2023 4:20 pm

Animal

Follow us on

Animal: ప్రస్తుతం ఇండియా వైడ్ గా అనిమల్ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా 800 కోట్లకు పైన కలక్షన్లను వసూలు చేసి తనదైన రీతిలో 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ పైన బాలీవుడ్ జనాలు కొన్ని విమర్శలను చేస్తున్నారు. అయితే అప్పుడేప్పుడో అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ దగ్గర స్టోరీ లేనప్పుడే ఆ డైరెక్టర్ ఎక్కువగా వైలెన్స్ మీద సెక్స్ మీద డిపెండ్ అవుతాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇక దాన్ని ఇప్పుడు బాలీవుడ్ జనాలు కొందరు అనిమల్ సినిమాకి యాడ్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఒక తెలుగు వాడు బాలీవుడ్ లో అంత పెద్ద సక్సెస్ కొట్టడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేక ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి అనిమల్ సినిమాని చూసుకుంటే దాంట్లో ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. ఒక కొడుకు తండ్రి కోసం పడే ఆవేదన, ఒక తండ్రి కోసం కొడుకు ఎంతకైనా తెగించగలడు అనే ఒక వాస్తవం, తండ్రి జోలికొస్తే ఎవడినైనా చంపేసేలా తండ్రి ముందు ఉండి పోరాటం చేస్తాడు అని మనకు చూపించాడు కాబట్టే ఆ సినిమా హిట్ అయింది.

అంతే తప్ప ఏదో వైలెన్స్, సెక్స్ సీన్స్ ఉంటే సినిమాని చూసి హిట్ చేసేంత పిచ్చోళ్లేం కాదు జనాలు అంటూ మరికొందరు వాళ్ళకి సరైన కౌంటర్లు వేస్తున్నారు. అటు రన్బీర్ కపూర్ కి ఉన్న ఆంటీ ఫ్యాన్స్ అలాగే తెలుగు వాడు బాలీవుడ్ లో సక్సెస్ కొడితే ఓర్వ లేని కొంతమంది కలిసి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అయినప్పటికీ సినిమాకి మాత్రం ఎక్కడ కూడా కలక్షన్స్ తగ్గడం లేదు.వాళ్ళు ఎంత నెగటివ్ గా ప్రచారం చేసుకున్న కూడా సినిమా అంత సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటుంది.

అంతే తప్ప సెక్స్ వైలెన్స్ ఉంటే సినిమా ఎందుకు ఆడుతుంది బాసు అంటూ మరి కొంతమంది వాళ్లకు కరెక్ట్ గా కామెంట్లు పెడుతూ వాళ్లని ఇరకాటం లో పెడుతున్నారు. ఎవడు ఎన్ని కామెంట్లు చేసిన సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో 1000 కోట్ల కలక్షన్స్ కొల్లగొట్ట బోతున్నాడు అనేది మాత్రం వాస్తవం… ఆయన సక్సెస్ ని చూసి జీర్ణించుకోలేని ఆ బాలీవుడ్ జనాలు నెగటివ్ కామెంట్లు చేయడం సహజం…