https://oktelugu.com/

Mohammed Siraj: మెడల్ అందుకున్న సిరాజ్ ఆనందంలో చెప్పిన కవిత చూడాల్సిందే.. వైరల్ వీడియో…

టి20 సిరీస్ కి కూడా ఈ బెస్ట్ ఫీల్డర్ మెడల్ ని ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి ఇండివిజువల్ సిరీస్ లో కూడా ఇలాంటి మెడల్ ని వాళ్ళకి ఇస్తు వాళ్లని ఎంకరేజ్ చేయాలని మన ఫీల్డింగ్ కోచ్ అయిన దిలీప్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 15, 2023 / 04:10 PM IST

    Mohammed Siraj

    Follow us on

    Mohammed Siraj: ఇండియన్ టీం లోని ప్లేయర్లని ప్రోత్సహించడానికి వన్డే వరల్డ్ కప్ టోర్నీ నుంచి ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో ఫీల్డింగ్ ప్రతిభను కనబరిచిన వారికి మన ఫీల్డింగ్ కోచ్ అయిన దిలీప్ బెస్ట్ ఫీల్డర్ మెడల్ ని ప్రధానం చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్,విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ని గెలుచుకున్నారు. అందులో విరాట్ కోహ్లీ రెండుసార్లు బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలుచుకున్నాడు…

    ఇక అదే విధంగా టి20 సిరీస్ కి కూడా ఈ బెస్ట్ ఫీల్డర్ మెడల్ ని ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి ఇండివిజువల్ సిరీస్ లో కూడా ఇలాంటి మెడల్ ని వాళ్ళకి ఇస్తు వాళ్లని ఎంకరేజ్ చేయాలని మన ఫీల్డింగ్ కోచ్ అయిన దిలీప్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సౌతాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో ఈ మెడల్ ని పొందడానికి రింకు సింగ్, యశస్వి జైశ్వాల్, మహమ్మద్ సిరాజ్ లాంటి ముగ్గురు ప్లేయర్లు పోటీ పడగా ఈ మెడల్ మాత్రం మహమ్మద్ సిరాజ్ ని వరించింది. దానికి తోడుగా ఆయన మెడల్ ని మెడలో వేసుకున్న తర్వాత ఈ మెడల్ కోసం నేను వరల్డ్ కప్ నుంచి చాలా ట్రై చేస్తున్నాను ఇప్పటికీ నా కల నెరవేరింది ఇకమీదట టీమ్ తరపున అత్యుత్తమమైన ప్రదర్శనలు చేస్తూ ముందుకు వెళ్తాను అంటూ ఒక మాటను చెప్పాడు.

    అలాగే ఈ సందర్భంగా తను ఒక కవిత్వం కూడా చెప్పాడు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టి20 సీరీస్ లో ఆడాడు.బౌలింగ్ లో సత్తా చాటనప్పటికి ఫీల్డింగ్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శనని కనబరిచాడు. రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించిన రీజా హెన్రిక్స్ ని రన్ అవుట్ చేసి తనదైన ప్రతిభను చూపించాడు… దాంతో మెడల్ ని కూడా గెలుచుకున్నాడు…

    ఇక ఫీల్డింగ్ కోచ్ అయిన దిలీప్ ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ లో మంచి ఫీల్డింగ్ ని కనబరిచిన ప్లేయర్లకి ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ పేరుతో ఒక మెడల్ ని అందించబోతున్నట్టు గా చెప్పాడు. అందులో ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సీరీస్ ని గెలుచుకున్న మొదటి ప్లేయర్ సిరాజ్ కావడం విశేషం…