Annamalai : తమిళనాడులో డీఎంకే ఇప్పటికే పొత్తులను ఫైనలైజ్ చేసింది. ఆల్ మోస్ట్ పోయిన సారి ఎలా ఉన్నాయో ఈసారి అలానే ఉన్నాయి. కాంగ్రెస్ కు 9 స్థానాలు, ఒకటి పుదుచ్చేరిలో, వీసీకే, సీపీఐ, సీపీఎంలకు చెరి రెండు స్థానాలు, మిగతా వాటికి చెరో ఒక స్థానం చొప్పున కేటాయించారు.
సీపీఎం స్థానాన్ని ఈసారి మార్చడం గమనార్హం. కోయంబత్తూరును సీపీఎంకు కేటాయించకుండా డీఎంకేనే పోటీచేయడం విశేషం. కమల్ హాసన్ పార్టీకి డీఎంకే ఒక్క సీటు ఇవ్వలేదు. కమల్ హాసన్ అయినా డీఎంకేకే మద్దతు ప్రకటించారు. కమల్ కు రాజ్యసభ ఇస్తారని అంటున్నారు.
అన్నాడీఎంకేకు పొత్తులు లేవు.. డీఎండీకేతో బ్యాక్ చానల్స్ టాక్స్ ఇతర పార్టీలతో నడుస్తున్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు.
ఇక అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా మారాక బీజేపీ ఎలాంటి పొత్తులు పెట్టుకోలేదు. భారీగా పాదయాత్రతో ప్రజాదరణ సంపాదించాడు. మొట్టమొదట పీఎంసీతో బీజేపీ పొత్తుకు మొగ్గుచూపింది. ఐజేకే కూడా బీజేపీతో చేరింది. ఏఐఎంకే పార్టీ శశికళ మేనల్లుడు పార్టీ ఇదీ..
పెద్ద పార్టీల్లో ‘పీఎంకే’ కీలకంగా ఉంది. మన్నియార్ కమ్యూనిటీకి చెందిన పార్టీ ఇదీ. వీళ్లు అన్నాడీఎంకేతో, ఇటు బీజేపీతో టాక్స్ నడుస్తున్నాడు. ఇది కొలిక్కి రాలేదు.
ఇక రజినీకాంత్ పరోక్షంగా సీఏఏకు మద్దతు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దని ప్రకటన చేశారు. ఇక బీజేపీ అన్నామలైతో ఫుల్ క్రేజ్ లోకి వచ్చింది. మెజార్టీ ఓటు శాతం దక్కించుకునేలా ఉంది.
అన్నామలై వ్యూహం తమిళనాట ఫలితాలిస్తుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.