Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిత్రం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు తేజ…ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా డైరెక్టర్ గా కూడా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఈయన కెరియర్ మొదట్లో చేసిన చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలైతే ఆయనకి యూత్ లో మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టాయి.
ఇక ఆ హిట్లతోనే ఆయన ఇప్పటివరకు సర్వైవల్ అవుతున్నాడు. ఇప్పుడు రానా హీరోగా ‘రాక్షస రాజా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా తేజకి మంచి పేరైతే ఉంది. తన మనసులో ఏది అనుకుంటాడో అది డైరెక్టుగా బయటకి చెప్పేస్తాడు. మనసులో ఒకటి పెట్టుకొని, బయటికి ఇంకొక మాట అసలు మాట్లాడాడు. ఎంతైనా వర్మ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి తేజకి కూడా అలాంటి ఘట్స్ ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’ అని చెప్పాడు.
ఎందుకంటే ఆ సినిమాలోనే పవన్ కళ్యాణ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ డ్ వాడుకున్నారు. ఇక ఆడియన్స్ ఎంటర్ టైన్ అయ్యే అంశాలు కూడా ఆ సినిమాలో ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పవన్ కళ్యాణ్ ని కూడా చాలామంది ఇష్టపడేలా చేసిందని తను చెప్పడం విశేషం… ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఖుషి అవుతున్నారు.
తేజ పవన్ కళ్యాణ్ తో ఒకవేళ సినిమా చేసే అవకాశం ఉందా అని ఇంటర్వ్యూలో అడిగగా, తనకి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ లేదని అందువల్లే తను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేనని చెప్పాడు…ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబో లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఇప్పటికే మంచి అంచనాలను పెట్టుకున్నారు…