Pushpa 2 : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. అయితే కొంతమంది సక్సెస్ లతోపాటు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను కూడా మూట గట్టుకుంటున్నారు. ఇక దానికి కారణం ఏదైనా కూడా ఒక హీరో ఐడెంటిటిని చూపించుకోవడానికి తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరమైతే ఉంటుంది…
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న సినిమా పుష్ప 2…ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తనదైన రీతిలో నటించి మెప్పించాడు.ఇక అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళు కూడా వీళ్లకు మంచి సహకారమైతే అందించారు. ఇక దాంతోపాటుగా సుకుమార్ డైరెక్షన్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ రాసుకున్న సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు హెల్ప్ చేశాయి. మరి మొత్తానికైతే ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 800 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతోంది అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కాస్ట్యూమ్స్ చాలా రిచ్ గా ఉండడమే కాకుండా ఆయనను భారీగా ఎలివేట్ చేయడంలో చాలా వరకు కృషి చేశాయనే చెప్పాలి.
మరి ఈ సందర్భంలో అల్లు అర్జున్ వాడిన కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే తెలుసుకుందాం.. నిజానికి పుష్ప 2 సినిమాకి అలీ అర్జున్ సిండికేట్ లీడర్ అయిన తర్వాత ఆయన వేసుకునే డ్రెస్ చాలా కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యం తో పోచంపల్లి లోని చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ సికో పట్టు వస్త్రాల నుంచి ఈ వస్త్రాలను తయారుచేసినట్టుగా తెలుస్తోంది.
ఇక పోచంపల్లి లో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగిన నేపథ్యంలో అక్కడి నుంచే ఈ కాస్ట్యూమ్స్ ని వాడినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెల్లడం అనేది నిజంగా గొప్ప విషయం ఇక బాలీవుడ్ లో సైతం ఈ సినిమా పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తుండటంతో బాలీవుడ్ హీరోలు సైతం మన పుష్ప 2 సినిమాను చూసి బెంబెలెత్తిపోతున్నారనే చెప్పాలి…
కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం మన సినిమాకి విశేషమైన ఆదరణను చూపిస్తూ సినిమా బ్లాక్ బస్టర్ చేయడంలో వాళ్ళు చాలా వరకు సహాయం చేశారనే చెప్పాలి… ఇక తొందర్లోనే పుష్ప 3 సినిమా కూడా పట్టాలెక్కబోతుంది. మరి రెండు పార్టులను సూపర్ సక్సెస్ గా నిలిపిన సుకుమార్ మూడో పార్ట్ ని ఎలా తెరకెక్కించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…