Vishnu Manchu: ఆస్తుల వివాదాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో గొడవలు చెలరేగాయి. భౌతిక దాడులు కూడా జరిగాయి. జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద సోమవారం నిన్న హైడ్రామా చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ప్రైవేట్ సైన్యంతో యుద్ధానికి దిగారు. విష్ణు తరఫున ఒక 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున ఓ 30 మంది బౌన్సర్లు రంగంలోకి దిగారు. మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య భేటీ జరగనుందని వార్తలు వచ్చాయి. విదేశాల నుండి విష్ణు వస్తున్నారని అన్నారు.
అలాగే మంచు లక్ష్మి ముంబై నుండి వచ్చారు. సాయంత్రం వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాగా మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కి వాట్సప్ సందేశం ద్వారా కంప్లైంట్ చేశాడట. సదరు కంప్లైంట్ లో మౌనిక, మనోజ్ ల నుండి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారట. తనకు రక్షణ కావాలి. తనకు ఏమైనా వారిదే బాధ్యత అని పొందుపరిచారట.
మరోవైపు ఫహడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మనోజ్ వెళ్ళాడు. సీఐ కి తన కంప్లైంట్ ఇచ్చాడు. తనతో పాటు భార్య మౌనిక, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే మోహన్ బాబు, విష్ణు పేర్లను ఫిర్యాదులో చేర్చలేదు. మోహన్ బాబుకు చెందిన పదిమంది అనుచరులపై ఆయన కంప్లైంట్ చేసినట్లు సమాచారం. కాగా విదేశాల్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని మీడియా చుట్టుముట్టింది.
ఈ వివాదం పై స్పందించాలని కోరారు. విష్ణు ఇష్టపడలేదు. అనంతరం ఆయన చూచాయిగా మాట్లాడారు. ఒకింత ఘాటు రిప్లై ఇచ్చాడు. అన్ని కుటుంబాలలో వివాదాలు ఉంటాయి. త్వరలోనే అన్ని సర్దుకుపోతాయి.. అన్నారు. జుల్పల్లి లో మోహన్ బాబు ఒక ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. శంషాబాద్ కి సమీపంలో ఉన్న ఈ ఫార్మ్ హౌస్ మార్కెట్ విలువ వందల కోట్లు అట. ఈ ఆస్తి తనకు కావాలని మనోజ్ డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.