Salaar: ప్రభాస్ ‘సలార్’ చిత్రంపై బాంబు పేల్చిన వేణుస్వామి

భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న సలార్ చిత్రంపై వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో పలువురి జాతకాలు చెప్పి వేణుస్వామి ఒక సెలబ్రిటీగా మారిపోయారన్న సంగతి తెలిసిందే.

Written By: Suresh, Updated On : December 6, 2023 12:55 pm

Salaar

Follow us on

Salaar: పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోందన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న సలార్ చిత్రంపై వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో పలువురి జాతకాలు చెప్పి వేణుస్వామి ఒక సెలబ్రిటీగా మారిపోయారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సలార్ మూవీపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన బాహుబలి సినిమా తరువాత ఏ చిత్రం కూడా హిట్ కాదని ముందే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో సాహో, రాధేశ్యామ్ ఆ తరువాత వచ్చిన ఆదిపురుష్.. ఇలా ప్రతి సినిమాకు విడుదలకు ముందే వాటి రిజల్ట్ చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమాలు కూడా అంతగా రాణించలేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఇటువంటి సందర్భంలో సలార్ చిత్రంపై గతంలోనే వేణు స్వామి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాని ప్రకారం కమర్షియల్ గా ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందని ఆయన చెప్పారని తెలుస్తోంది. ప్రభాస్ కొంతకాలం ఈ ఫ్లాప్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అభిమానులు సలార్ సినిమాపై ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి హెచ్చరించారని వీడియోలోని సారాంశం. వేణుస్వామి మాటలను కొందరు సీరియస్ గా తీసుకున్నప్పటికీ మరి కొంతమంది అభిమానులు మాత్రం సలార్ సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు తాజాగా విడుదలైన సలార్ ట్రైలర్ తో ప్రేక్షకుల నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వేణుస్వామి చెప్పింది నిజమవుతుందా? లేక సినిమా హిట్ గా నిలుస్తుందా ? అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.