Game Changer: దేశం మెచ్చిన దర్శకుల్లో శంకర్(Shankar) ఒకరు. సామాజిక సమస్యలను కమర్షియల్ హంగులతో అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. శంకర్ తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక మాస్టర్ పీస్. ఇండియన్ సినిమాకు భారీతనం నేర్పిన మొదటి దర్శకుడు శంకర్ అనడంలో సందేహం లేదు. శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్స్ లో ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో వసూళ్ల వర్షం కురిపించింది. చాలా కాలం తర్వాత శంకర్ మరలా అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్(Game Changer) చేశారు.
గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ మూడు భిన్నమైన పాత్రలు చేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన అప్పన్న అనే పొలిటీషియన్ రోల్ చేశాడు. అలాగే అవినీతిపరులైన రాజకీయనాయకుల భరతం పట్టే ఐఏఎస్ అధికారి పాత్ర మరొకటి. పోలీస్ అధికారికంగా కూడా రామ్ చరణ్ కనిపిస్తారట. సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదలైంది. తెల్లవారు జాము నుంచే ఏపీలో ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. గేమ్ ఛేంజర్ థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
కాగా శంకర్ ఇప్పటి వరకు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. శంకర్ కి ఇండియా వైడ్ ఫేమ్ ఉన్నప్పటికీ తమిళ హీరోలతో మాత్రమే పని చేశారు. ఒకే ఒక్కడు హిందీ రీమేక్ నాయక్ మాత్రం అనిల్ కపూర్ తో చేశాడు. శంకర్ తో పని చేసిన నాన్ తమిళ్ హీరో అనిల్ కపూర్ మాత్రమే. ఎట్టకేలకు ఆయన తెలుగు హీరో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేశారు. అయితే గతంలో శంకర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, మహేష్ బాబు లతో సినిమాలు చేయాలని అనుకున్నారట. అవి కార్యరూపం దాల్చలేదట.
ఇక గేమ్ ఛేంజర్ మూవీ చేయడానికి తనకు మహేష్ బాబు(Mahesh Babu) చిత్రాలే స్ఫూర్తి అని శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి చిత్రాలు శంకర్ కి చాలా ఇష్టం అట. ఆ తరహా పక్కా కమర్షియల్ సబ్జెక్టులు చేయాలని ఆయన భావించేవారట. గేమ్ ఛేంజర్ మూవీ అటువంటి సినిమానే, అని శంకర్ ఓపెన్ అయ్యారు. నిజాయితీగల ఐఏఎస్ అధికారి-కరెప్టెడ్ పొలిటీషియన్స్ మధ్య జరిగే వార్ అద్భుతంగా ఉంటుందని, శంకర్ చెప్పుకొచ్చాడు. కాబట్టి పరోక్షంగా గేమ్ ఛేంజర్ తో మహేష్ బాబుకు లింక్ ఉందన్నమాట.