Dil Raju: నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన 50వ చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ తెరకెక్కించారు. పక్కా పొలిటికల్ థ్రిల్లర్ కాగా రామ్ చరణ్ మూడు భిన్నమైన పాత్రలు చేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ అప్పన్న అనే రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. అలాగే ఐఏఎస్, ఐపిఎస్ అధికారిగా కూడా రామ్ చరణ్(Ram Charan) పాత్రలు ఉంటాయట.
కాగా గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన తెలంగాణ సంస్కృతిని కించపరిచాడనే వాదన మొదలైంది. దిల్ రాజు వ్యాఖ్యలను తెలంగాణవాదులు ఖండిస్తున్నారు. దిల్ రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు.. తెలంగాణలో కల్లు, మటన్ అంటే వైబ్ ఇస్తారని అన్నారు. దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. దిల్ రాజుపై ధ్వజమెత్తారు. దిల్ రాజు తెలంగాణ సంస్కృతిని కించపరిచాడని, అన్నారు.
తెలంగాణ ప్రజలు, జీవన విధానం, సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడిన దిల్ రాజు ఇకపై సినిమాలు చేయడం మానుకోవాలి. ఆయన చెప్పినట్లు కల్లు కాంపౌండ్ లేదా, మటన్ షాప్ పెట్టుకోవాలంటూ డిమాండ్ చేశాడు. దిల్ రాజు వ్యాఖ్యలపై నిరసనల నేపథ్యంలో ఆయన స్పందిస్తారో లేదో చూడాలి.
మరోవైపు ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సైతం దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ ఉంది. పక్కా సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెరకెక్కించారు.