https://oktelugu.com/

Senior NTR: సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ ఏమేం పనులు చేశారో తెలుసా?

Senior NTR: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న హీరో ఎన్టీఆర్. ఆయన నటించిన సినిమాల్లో ఆయన చూపిన నటనా కౌశలానికి అందరూ ఫిదా కావాల్సిందే. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా ఎన్టీఆర్ నటన వైవిధ్యంగా ఉండటంతో ఆయన ఎదురులేని కథానాయకుడిగా ఎదిగారు. తెలుగులో ఎవరైనా ఆయన తరువాతే. అంతటి ఘనత సాధించిన కథానాయకుడిగా ఆయన సినిమాలు ఉండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మళయాలంలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించి తానేమిటో నిరూపించుకున్నారు. తెలుగు చలన […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 29, 2022 / 10:15 AM IST
    Follow us on

    Senior NTR: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న హీరో ఎన్టీఆర్. ఆయన నటించిన సినిమాల్లో ఆయన చూపిన నటనా కౌశలానికి అందరూ ఫిదా కావాల్సిందే. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా ఎన్టీఆర్ నటన వైవిధ్యంగా ఉండటంతో ఆయన ఎదురులేని కథానాయకుడిగా ఎదిగారు. తెలుగులో ఎవరైనా ఆయన తరువాతే. అంతటి ఘనత సాధించిన కథానాయకుడిగా ఆయన సినిమాలు ఉండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మళయాలంలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించి తానేమిటో నిరూపించుకున్నారు. తెలుగు చలన చిత్ర రంగానికి దొరికిన ఆనిముత్యం లాంటి నటుడని చెబుతారు. అంతటి కీర్తిప్రతిష్టలు సాధించిన నటుడిగా ఆయన ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఆయన మన మధ్య లేకున్నా ఆయన నటించిన సినిమాలు మాత్రం మనకు కళ్లెదుటే నిలవడం తెలిసిందే.

    Senior NTR

    ఎన్టీఆర్ తన ఎదుగుదలకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. రాముడైనా, కృష్ణుడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా పాత్రకు వంద రెట్లు న్యాయం చేసేవారు. దీంతో ఆయన నిర్మాతలకు నష్టాలు వచ్చేవి కాదు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వచ్చేవారట. సినిమాల నిర్మాణంలో ఆయన క్రమశిక్షణ చూసి అందరు ఆశ్చర్యపోయేవారట. షూటింగ్ ఉంటే సమయానికంటే ముందే సెట్ కు చేరుకోవడం ఎన్టీఆర్ కు ఉన్న మంచి అలవాటు. దీంతోనే ఆయన తన చిత్రాల కోసం ఎంత శ్రద్ధ తీసుకునే వారో అర్థమవుతోంది కదా.

    Also Read: Bindu Madhavi: ‘బిందుమాధవి’కి మరో రెండు భారీ ఆఫర్స్.. ఆ సినిమా కూడా !

    ఎన్టీఆర్ సినిమాలకు రాకముందు కొన్ని పనులు చేసినట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఇంట్లో కిరాయి ఉంటున్న సూర్యనారాయణ అనే వ్యక్తి కోసం ముంబై వెళ్లి అక్కడో మెస్ పెడతారు. కానీ అది లాభసాటిగా లేదని వదిలేస్తారు. తరువాత ఆయనకు ఎయిర్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చినా భార్య ఒప్పుకోకపోవడంతో ఆ ఉద్యోగం వదిలేశారు. తరువాత కాలంలో ఆయనకు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం రావడంతో అది కూడా ఓ పదకొండు రోజులు మాత్రమే చేసి వదిలేశారట. దీంతో ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు ఇలా పలు పనులు చేయడంతో ఆయన పలు కోణాల్లో బాధలు పడినట్లు తెలుస్తోంది.

    Senior NTR

    ఎన్టీఆర్ సినిమాల మీద ఉత్సాహంతో మద్రాస్ వెళ్లి అవకాశాల కోసం ఎదురు చూశారు. భార్య ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినిమాల్లో చాన్సుల కోసం ఎంతో కాలం వెయిట్ చేశారు. అయినా నిరుత్సాహ పడకుండా సినిమాల్లో నటించడానికి ఎంతో శ్రమించారు. దీంతో వచ్చిన అవకాశాలను మెల్లగా సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. తెలుగు చిత్ర సీమకు వన్నె తెచ్చారు. తనదైన శైలిలో నటించి తెలుగు వారి ఆత్మబంధువుగా మారారు. రాజకీయాల్లో కూడా రాణించి మంచి నాయకుడిగా మారడం తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలుసుకోవాలని అందరికి ఆతృత ఉండటం సాధారణమే. కానీ ఆయన సినిమాల్లోకి రాకముందు కూడా ఎన్నో కష్టాలు పడినట్లు చెబుతున్నారు.

    Also Read:Nayanthara Wedding: నయనతార పెళ్లి ఆహ్వానం అదిరింది.. వీడియో వైరల్ !

    Tags