Allu Arjun Sukumar fight: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రేక్షకులకు స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ వారిని స్టార్లుగా నిలబెట్టిన దర్శకులను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. కొంతమంది దర్శకులు మాత్రం వాళ్ల సినిమాలతో డైరెక్టర్ అనే పదానికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే, అతని తర్వాత స్థానంలో సుకుమారు ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గత సంవత్సరంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పటివరకు రామ్ చరణ్ కి సంబంధించిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక గతంలో దిల్ రాజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సుకుమార్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ ఆర్య సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నేను, సుకుమార్, బన్నీ ముగ్గురం కలిసి మరో సినిమా చేయాలని అనుకున్నాం. కానీ దిక్కు చెప్పిన జగడం కథ విన్న తర్వాత నాకు ఎక్కడో ఇందు ఏదో ఒక లోపం ఉంది అనిపించింది. ఆ తర్వాత బన్నీ విన్నాడు అతనికి కూడా అలానే అనిపించిందట.
ఇక మేమిద్దరం కలిసి అందులో కొంచెం లోపం ఉందని సుకుమార్ కు చెప్పే ప్రయత్నం చేసినప్పటికి తను రాసుకున్న కథ తనకు ఎక్స్ట్రాడినరీగా అనిపించిందని ఈ సినిమా మీరు చేస్తారా? లేదంటే వేరే బ్యానర్ లో చేసుకోమంటారా అని తను కోపంగా అడిగేంత వరకు వెళ్ళిందని దిల్ రాజు చెప్పాడు.
ఇక సుక్కు వేరే బ్యానర్ లో సినిమా ఒకే చేయించుకున్న కూడా మా మధ్య క్లాశేష్ రాకుండా ఉండాలని బన్నీ, నేను ఇద్దరం కలిసి ఆ మూవీ లాంచ్ కి వెళ్ళాం అంటూ దిల్ రాజు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… నిజానికి సుకుమార్ గొప్ప రైటర్ అని ఆయన రాసుకున్న కథలు చాలా కొత్తగా ఉంటాయి. అందువల్లే ఆర్య సినిమా వచ్చిందని ఇక అదే ధోరణిలో జగడం కథ కూడా రాసుకున్నాడని అందువల్లే అతన్ని కన్విస్ చేయాలని మేము చూసిన అతను కన్విన్స్ అవ్వలేదన్నాడు.
ఒక్కసారి తన మైండ్లో ఫిక్స్ అయ్యాడు అంటే దాన్ని పక్క పట్టాలెక్కించేదాకా ఊరుకోడంటూ సుకుమార్ గురించి చాలా గొప్పగా చెబుతూనే అతను చేసిన మిస్టేక్ ని కూడా చెప్పాడు. మొత్తానికైతే జగడం ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలింది. కానీ సుకుమార్ వర్క్ కి మాత్రం చాలా గొప్ప గుర్తింపైతే వచ్చింది…