Pawan Kalyan- Godfather Trailer: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కానుంది. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే మంచి టాక్ వస్తోంది. సినిమా చిత్రీకరణలో భాగంగా పలు షాట్లు అందరిని అబ్బురపరిచేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక థియేటర్లలో గాడ్ ఫాదర్ ప్రేక్షకులను మెప్పించడమే తరువాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో సంబంధం ఉన్నట్లు పలు షాట్లు రుజువు చేస్తున్నాయి.

సినిమాలో చిరంజీవికి బాడీగార్డ్ గా నటించిన సల్మాన్ స్థానంలో పవన్ కల్యాణ్ ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేదని చెబుతున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. జనసేన పార్టీని జేఎస్పీగా పిలుస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ లో జేజేపీగా చూపించడం విశేషం. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య జరిగే సన్నివేశాల్లో పవన్ కల్యాణ్ ఉంటే సినిమా మరింత రంజుగా ఉండేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమాపై పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. సినిమా బాగా వచ్చిందని కితాబిచ్చారు. అన్నయ్య నటన హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
Also Read: Ponniyin Selvan Review: పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ రివ్యూ
పలు సన్నివేశాల్లో చిరంజీవి నటన చూస్తుంతో అబ్బుర పరుస్తోంది. ఆయనలోని నటన ఇంకా ఉన్నతంగా అనిపిస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. గాడ్ ఫాదర్ సినిమా కచ్చితంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని విశ్వసిస్తున్నారు. హిందీ మార్కెట్ కోసమే సల్మాన్ ఖాన్ ను తీసుకున్నట్లు చెబుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల్లో చిరు నటన ప్రతిష్టాత్మకంగా కనిపిస్తుంది. గాడ్ ఫాదర్ సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సినిమాలో సత్యదేవ్, నయనతార, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు నటించారు.

గతంలో నటించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో గాడ్ ఫాదర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. చావో రేవో అనే తీరులో చిరు గాడ్ ఫాదర్ పై ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు. గాడ్ ఫాదర్ ను కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలుగుతోంది. తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. చిరు నటన, డ్యాన్సులను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా కానుకగా గాడ్ ఫాదర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Singer Mangli Remuneration: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
[…] […]
[…] […]