https://oktelugu.com/

IMDB Releases Top 10 Indian Films: ‘ఐఎమ్డీబీ – 2022’: ఇప్పటివరకు టాప్ 10 భారతీయ చిత్రాల లిస్ట్ ఇదే

IMDB Releases Top 10 Indian Films: అంతర్జాతీయ ప్రఖ్యాత సమీక్ష సంస్థ ఐఎమ్డీబీ ( IMDb) 2022కి గానూ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ‘విక్రమ్'(తమిళం) అగ్రస్థానంలో నిలిచింది. అయితే తొలి పది స్థానాల్లో ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ తప్ప, మరో తెలుగు సినిమా లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. ఇంతకీ అత్యంత ప్రజాదరణ పొందిన ఈ టాప్-10 చిత్రాల లిస్ట్ చూద్దాం రండి. 1. విక్రమ్ సినిమా : […]

Written By:
  • Shiva
  • , Updated On : July 13, 2022 / 05:03 PM IST
    Follow us on

    IMDB Releases Top 10 Indian Films: అంతర్జాతీయ ప్రఖ్యాత సమీక్ష సంస్థ ఐఎమ్డీబీ ( IMDb) 2022కి గానూ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ‘విక్రమ్'(తమిళం) అగ్రస్థానంలో నిలిచింది. అయితే తొలి పది స్థానాల్లో ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ తప్ప, మరో తెలుగు సినిమా లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. ఇంతకీ అత్యంత ప్రజాదరణ పొందిన ఈ టాప్-10 చిత్రాల లిస్ట్ చూద్దాం రండి.

    IMDB Releases Top 10 Indian Films

    1. విక్రమ్ సినిమా :

    ‘విక్రమ్’ సినిమాకు ఐఎమ్డీబీ ( IMDb) 8.6 రేటింగ్ ఇచ్చింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా హీరో సూర్య విలన్ గా కనిపించడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కమల్ కెరీర్ లోనే భారీ కలెక్షన్ల చిత్రంగా ఈ చిత్రం రికార్డులకెక్కింది.

    Also Read: Heroine Anjali: ఐటమ్ సాంగ్ చేసిందని తప్పించారట.. పాపం అంజలి

    Vikram Movie

    2. ‘కేజీఎఫ్ 2’ :

    ‘KGF: చాప్టర్ 2’ సినిమాకు ఐఎమ్డీబీ ( IMDb) 8.5 రేటింగ్ ఇచ్చింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం, యావత్తు మాస్ ప్రేక్షక లోకాన్ని చాలా బాగా ఆకట్టుకుంది. అత్యధిక వసూళ్లు రాబట్టి, విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

    K.G.F: Chapter 2

    3. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ :

    ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ఐఎమ్డీబీ ( IMDb) 8.3 రేటింగ్ ఇచ్చింది. ఈ సినిమాకి మూడో స్థానం లభించింది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. చిన్న సినిమాగా విడుదలైన సంచలనం సృష్టించింది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యాడు. ఆ రేంజ్ లో ఈ సినిమాని తీశాడు.

    The Kashmir Files

    4. ‘హృదయం’ (మలయాళం) :

    హృదయం 2022లో విడుదలైన మలయాళం సినిమా. విశాఖ్ సుబ్రమణియం నిర్మించిన ఈ సినిమాకు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించింది. అందుకే, ఈ లిస్ట్ లో నాలుగో ప్లేస్ లో ఉంది. ఐఎమ్డీబీ ఈ చిత్రానికి 8.1 రేటింగ్ ఇచ్చింది.

    Hridayam

    5. ‘ఆర్ఆర్ఆర్’ :

    ‘ఆర్ఆర్ఆర్’ 5వ స్థానంలో నిలవడం కొంత ఆశ్చర్యకరమే. ఈ సినిమా ఇంకా ముందు స్థానాల్లో రావాల్సింది. కానీ ఈ సినిమాకు ఐఎమ్డీబీ ( IMDb) 8.0 రేటింగ్ ఇచ్చింది. నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ భారీ విజయాన్ని సాధించింది.

    RRR

    6. ఏ థర్స్ డే :

    ఏ థర్స్ డే హిందీలో విడుదలైన థ్రిల్లర్ సినిమా. ఆర్.ఎస్.వి.పి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి, నేహా ధూపియా, డింపుల్ కపాడియా, కరణ్ వీర్ శర్మ నటించారు. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 17 2022న స్ట్రీమింగ్ అయ్యింది. ఐఎమ్డీబీ ఈ చిత్రానికి 7.8 రేటింగ్ ఇచ్చింది.

    A Thursday

    7. ఝుండ్ :

    ఝుండ్ 2022లో హిందీలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా సినిమా. ఈ సినిమాకు నాగరాజ్ మంజులే ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. భూషణ్ కుమార్, కిషన్ కుమార్, రాజ్ హిరేమత్, సవితా రాజ్ హిరేమత్, నాగ్ రాజ్ మంజుల, గార్గీ కులకర్ణి, మీనూ అరోరా లాంటి సినీ ప్రముఖులు అందరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐఎమ్డీబీ ఈ చిత్రానికి 7.84 రేటింగ్ ఇచ్చింది.

    Jhund

    8. ‘రన్‌వే 34’ :

    ‘రన్ వే 34’ అనే సినిమా కూడా హిందీ సినిమానే. హీరో అజయ్ దేవ్‌గణ్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఈ సినిమాకు మొదట ‘మేడే’ గా ప్రకటించి అనంతరం ‘రన్‌వే 34’గా పేరు మార్చారు. ఈ చిత్రానికి ఐఎమ్డీబీ 7.1 రేటింగ్ ఇచ్చింది. దాంతో ఈ సినిమా 8 ప్లేస్ లో నిలిచింది.

    Runway 34

    9. ‘గంగూభాయ్ క‌తియావాడీ’

    ‘సంజ‌య్‌లీలా భ‌న్సాలీ’ సినిమా అంటేనే… భారీ తనంతో మిళితమైన ఓ వైవిధ్యభరితం. అలాంటి గ్రేట్ విజువల్ డైరెక్టర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘గంగూభాయ్ క‌తియావాడీ’గా కనిపించి అలరించింది అలియా భట్. ఈ సినిమాకు ఐఎమ్డీబీ ( IMDb) 7.0 రేటింగ్ ఇచ్చింది

    Gangubai Kathiawadi

    10.’సామ్రాట్ పృథ్వీరాజ్’ :

    సామ్రాట్ పృథ్వీరాజ్‌ కూడా హిందీ సినిమానే. ఢిల్లీని పరిపాలించిన చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఐఎమ్డీబీ ( IMDb) 7.0 రేటింగ్ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాలు ఇవే.

    Samrat Prithviraj

    Also Read:Mokshagna: ‘పవన్ కళ్యాణ్’ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా.. బాలయ్య గ్రీన్ సిగ్నల్

    Tags