https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అమ్మాయిపై అర్జున్ బలప్రయోగం, అశ్వినిని గట్టిగా తోసేసి… పీక పట్టుకోగలనన్న సందీప్!

గేమ్ పూర్తయ్యాక సందీప్ బయట గార్డెన్ ఏరియాలో అమర్ దీప్,తేజ తో అర్జున్ గురించి డిస్కషన్ పెట్టాడు. ఫిసికల్ గేమ్ ఆడటం తప్పు,అర్జున్ ఇలా పీక పట్టుకుని తోసేశాడు అని సందీప్ చెప్పాడు. అర్జున్ గట్టిగా తోయడంతో అశ్విని పడిపోయిందని అన్నాడు సందీప్.

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2023 / 04:54 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ రేస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు గేమ్ లు పూర్తయ్యాయి. ప్రియాంక జైన్,పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. రతిక ఇంకా అమర్ దీప్ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే కెప్టెన్సీ మారథాన్ లో భాగంగా మూడో గేమ్ బిగ్ బాస్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ గేమ్ లో అశ్విని శ్రీ,అర్జున్,భోలే,సందీప్ మాస్టర్ పాల్గొన్నారు.’స్టోర్ ఇట్ పోర్ ఇట్’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

    ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ షవర్ కింద నిలబడి తమ తలపై స్పాంజ్ హెల్మెట్ లో వీలైనన్ని నీళ్లు నింపుకోవాలి. వారికి కేటాయించిన బౌల్స్ లో స్పాంజ్ లోని నీళ్లు పిండి బౌల్ నింపాల్సి ఉంటుంది.ఇలా ఎవరైతే ఎక్కువ నీళ్లు బౌల్ లో నింపుతారో కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారు. అందరూ తమ ప్రయత్నాలు తాము చేస్తూ బౌల్ నింపారు. తర్వాత షవర్ కింద నీళ్లు పట్టుకునే క్రమంలో అర్జున్,అశ్విని ని తోసేశాడు. దాంతో ఆమె కింద పడిపోయింది.

    గేమ్ పూర్తయ్యాక సందీప్ బయట గార్డెన్ ఏరియాలో అమర్ దీప్,తేజ తో అర్జున్ గురించి డిస్కషన్ పెట్టాడు. ఫిసికల్ గేమ్ ఆడటం తప్పు,అర్జున్ ఇలా పీక పట్టుకుని తోసేశాడు అని సందీప్ చెప్పాడు. అర్జున్ గట్టిగా తోయడంతో అశ్విని పడిపోయిందని అన్నాడు సందీప్.

    నేను కూడా అలా చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు .. కానీ నేను అలా ఆడాలనుకోలేదు అని అమర్ ,తేజ లతో చెప్పాడు సందీప్ మాస్టర్. ఆ తర్వాత అర్జున్ బాత్ రూమ్ లో కి వెళ్లి శివాజీ తో ‘అందరూ మాస్టర్ మాస్టర్ అంటున్నారు. మొత్తం నాకు అగెనెస్ట్ అయ్యారేంటి అని అడిగాడు. ఇంతకు ముందు అంతా నో మాస్టర్ అనేవాళ్ళు .. ఇప్పుడంతా మాస్టర్ మాస్టర్ అంటున్నారు అని అర్జున్,శివాజీ తో చెప్పాడు. దీనికి శివాజీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ వెళ్ళిపోయాడు. ఈ టాస్క్ లో సందీప్ గెలిచినట్లు సమాచారం..