Lata Mangeshkar: భారత గాన కోయిలమ్మ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఇక లేరు అనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆమె మన మధ్యన లేకపోయినా.. ఆమె పాటలు శాశ్వతంగా ఉంటాయి. ఇక ఆ దిగ్గజ గాయని దేశంలోని వివిధ భాషల్లో పాటలు పాడారు. తెలుగులో మాత్రం చాలా తక్కువ పాటలు పాడారు. తొలిసారిగా 1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన సంతానం సినిమాలో ‘నిదురపోరా తమ్ముడా’ అనే పాట పాడారు.
ఆ తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిన ‘దొరికితే దొంగలు’ మూవీలో ఓ పాట ఆలపించారు. అలాగే 1988లో నాగార్జున, శ్రీదేవి నటించిన ఆఖరి పోరాటంలో ‘తెల్లచీరకు’ పాటను SP బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. ఆమె తెలుగులో తక్కువ పాటలు పాడినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గర అవ్వడం నిజంగా విశేషమే.
Also Read: యంగ్ హీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ !
అన్నట్టు గానకోకిల లతామంగేష్కర్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలవాలని ఉపవాసం ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమెనే స్వయంగా తెలిపారు. ‘నేనూ, నా ఫ్యామిలీ మ్యాచ్ జరిగేంత సేపు ఓ మూఢ నమ్మకాన్ని ఫాలో అయ్యాం. భారత్ గెలవాలని ఏమీ తినలేదు. తాగలేదు. చాలా టెన్షన్ పడ్డాం. భారత్ మ్యాచ్ గెలిచాక డిన్నర్ చేశాం’ అని చెప్పారు.
1983లో ఫైనల్ మ్యాచ్ ను లతామంగేష్కర్ లండన్ వెళ్లి చూశారు. పైగా ఆమె అప్పట్లో భారత్ గెలవాలని ఉపవాసం కూడా చేశారు. బహుశా స్వఛ్ఛమైన ఆమె మనసుతో ఉపవాసం చేయడం కారణంగానే ఆమె ఇండియా గెలిచి ఉంటుంది.
Also Read: ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు.. చేస్తే అరిష్టమే!