https://oktelugu.com/

Sampath Raj: సంపత్ రాజ్ భార్య ఎవరో తెలుసా? అసలు విడిపోవడానికి కారణం ఏంటి?

Sampath Raj: రఘువరన్ బీ‌టెక్.. ఇంజినీరింగ్ చేసిన ప్రతి నిరుద్యోగికి ఈ మూవీ అంటే ఎంతో ఇష్టం.. వారి కష్టాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా ధనుష్, అమలాపాల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ హీరో తల్లి.. ఈ క్యారెక్టర్‌లో శరణ్య తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మూవీలో ఈ క్యారెక్టర్‌తోనే సెంటిమెంట్ సన్నివేశాలు పండాయి. ఒక విధంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి కారణం […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 7, 2022 / 02:04 PM IST

    Sampath Raj

    Follow us on

    Sampath Raj: రఘువరన్ బీ‌టెక్.. ఇంజినీరింగ్ చేసిన ప్రతి నిరుద్యోగికి ఈ మూవీ అంటే ఎంతో ఇష్టం.. వారి కష్టాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా ధనుష్, అమలాపాల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ హీరో తల్లి.. ఈ క్యారెక్టర్‌లో శరణ్య తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మూవీలో ఈ క్యారెక్టర్‌తోనే సెంటిమెంట్ సన్నివేశాలు పండాయి. ఒక విధంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఈ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఈ మూవీతో శరణ్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

    Sampath Raj

    కానీ రియల్ లైఫ్ లో మాత్రం శరణ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె భర్త మరెవరో కాదు.. ఎక్కువగా విలన్ క్యారెక్టర్లలో కనిపించే సంపత్ రాజ్. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. కానీ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన మిర్చి మూవీలో విలన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. తమిళం మూవీస్‌లో యాక్ట్ చేస్తూ సినీ కెరీర్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, మలయాళం తదితర భాషల్లోనూ తన యాక్టింగ్ తో అందరికీ దగ్గరవుతున్నారు. ఇటీవలే ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భార్య గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. వారు పడిన ఇబ్బందులను, విడిపోవడానికి గల కారణాలు పంచుకున్నారు సంపత్ రాజ్.

    Also Read:  ‘ప్రపంచ కప్’ గెలవాలని లతాజీ ఏమి చేసేవారే తెలుసా ?

    తన భార్యకు 23 ఏండ్ల వయసులో తనతో పెళ్లి జరిగిందని దీంతో తమ లక్ష్యాలు సాధించుకోలేక అనేక ఇబ్బందులు పడినట్టు చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక అనేక ఒత్తిడికి గురయ్యారని చెప్పుకొచ్చారు. ఎవరి లక్ష్యాలను వారు నెరవేర్చుకోవాలని విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు.

    Sampath Raj

    తన కూతురి సంరక్షణ మాత్రం తానే తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె కెరిర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఒక వేళ తన కూతురు ఇండస్ట్రీలో సెటిల్ అవుతానని చెబితే తాను తప్పనిసరిగా ప్రోత్సహిస్తానని తెలిపారు. ప్రస్తుతం సంపత్ రాజ్ తో శరణ్య సైతం ఆయా భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ చేస్తున్నారు. ఎవరి లైఫ్‌లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు.

    Also Read: ‘చొప్ప దండి’ రివ్యూ: వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?

    Tags