https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ తో వస్తుందో తెలుసా..?

మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి సుకుమార్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకొని ఇండియన్ ఇండస్ట్రీ లోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ఉద్దేశ్యం లో అయితే ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 16, 2024 / 02:52 PM IST

    Do you know what kind of back drop Ram Charan Sukumar movie will come with

    Follow us on

    Ram Charan: ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది అనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ అయితే ఉంది. ఇక దానికి అనుకూలంగానే ఈ సినిమా మొత్తం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారట.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి సుకుమార్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకొని ఇండియన్ ఇండస్ట్రీ లోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ఉద్దేశ్యం లో అయితే ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన తీవ్రమైన కసరత్తులను అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకోగా, ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన అంచనాలైతే పెరుగుతున్నాయి.

    ఇక ఇప్పటికే రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ కాంబో మరోసారి ఇండస్ట్రీ హిట్ మీదే కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది… అయితే వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా 1880 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా భారీ రివెంజ్ డ్రామాగా కూడా తెరకెక్కుతుందట. అయితే ఈ సినిమా ద్వారా అటు రామ్ చరణ్, ఇటు సుకుమార్ ఇద్దరు కూడా భారీ లెవెల్లో సక్సెస్ సాధించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

    అయితే సుకుమార్ ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ తో తను చేసే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది…మరి ఈ సినిమా ఎప్పుడు పట్టలెక్కుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి…