R. Narayana Murthy- Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్-ఆర్ నారాయణమూర్తి ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటి వారు. ఒకరు పక్కా కమర్షియల్ హీరో. మరొకరు సోషల్ మెసేజ్ చిత్రాలతో పీపుల్స్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ వీరి మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే వీరిద్దరినీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు. మహేష్-ఆర్ నారాయణమూర్తి ఒకే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. దాసరి నారాయణరావు యంగ్ ఏజ్ లోనే సినిమా మీద మక్కువ పెంచుకున్నారు. చెన్నై వెళ్లి దాసరి నారాయణరావును కలిశారు.
దాసరి ఆర్ నారాయణమూర్తికి ఓ సలహా ఇచ్చాడట. ఇక్కడ రాణించడం అంత సులభం కాదు. వెళ్లి డిగ్రీ పూర్తి చేయ్. అప్పుడు సక్సెస్ కాకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పి పంపారట. గురువుగారి కోరిక మేరకు ఆర్ నారాయణమూర్తి బిఏ పూర్తి చేసి మరలా చెన్నై వెళ్లారట. దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’ మూవీలో ఆర్ నారాయణమూర్తికి సెకండ్ హీరో ఛాన్స్ దక్కింది. అలా నారాయణమూర్తి నట ప్రస్థానం మొదలైంది. పరిశ్రమలో నిలదొక్కుకున్న ఆర్ నారాయణమూర్తి దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా, రచయితగా రాణిస్తున్నారు.
ఇక మహేష్ బాబు కూడా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది నీడ మూవీతోనే. ఐదారేళ్ళ ప్రాయంలో మహేష్ నీడ చిత్రంలో చిన్న పాత్ర చేశాడు. నటుడిగా మహేష్ డెబ్యూ మూవీ నీడ. తర్వాత ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా చిత్రాలు చేశారు. టీనేజ్ రాకుండానే మహేష్ హీరో రేంజ్ రోల్స్ చేశారు. యాక్షన్, సాంగ్స్ ఇరగదీశాడు. మల్టీస్టారర్స్ చేశారు. మహేష్ ని హీరో చేసింది మాత్రం రాఘవేంద్రరావు. 1999లో విడుదలైన రాజకుమారుడు మూవీతో మహేష్ పూర్తి స్థాయిలో హీరో అయ్యారు.
ఇక దాసరి పదుల సంఖ్యలో నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్స్ గా వెలిగిపోయారు. మోహన్ బాబు, శ్రీహరి, అన్నపూర్ణ ఈ లిస్ట్ లో ఉన్నారు. యాంకర్ సుమ, రైటర్ వక్కంతం వంశీలను హీరో హీరోయిన్ గా కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో పరిచయం చేశారు. ఆ సినిమా ఆడలేదు. దర్శకులుగా నిలదొక్కుకున్న ఆయన శిష్యులు ఎందరో ఉన్నారు. నేడు దాసరి నారాయణరావు జయంతి. చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దాసరి 2017 మే 30న కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు.