Mrunal Thakur: ఈ ఏడాది లో నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపించిన సినిమాలలో ఒకటి సీతారామం..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించింది..ముఖ్యంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించిన దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ఈ సినిమా..దుల్కర్ సల్మాన్ మలయాళం లో స్టార్ హీరో మరియు మమ్ముటి కొడుకు అనే విషయం సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు..అంతే కాకుండా ఈయన హీరో గా నటించిన ‘కనులు కనులు దోచాయంటే’ మరియు ‘కురుప్’ సినిమాలు తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచాయి..వీటితో పాటు మహానటి సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రతి తెలుగోడికి సుపరిచితమయ్యాడు..కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ గురించి మాత్రం ఎవరికీ తెలియదు..ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది..ఎవరు ఈ అమ్మాయి..ఇంతకు ముందు ఈమె నటించిన సినిమాలు ఏమిటి అని గూగుల్ లో వెతకడం మొదలెట్టారు.

అలా గూగుల్ లో ఈమె గురించి వెతకగా చాలా విషయాలే వెలుగులోకి వచ్చాయి..అవేమిటి అంటే ఈమె సినిమాల్లోకి అడుగుపెట్టేముందు ఎన్నో టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది..బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘కుంకుమ భాగ్య’ సీరియల్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది..ఈ సీరియల్ ని తెలుగు లో దబ్ చేసి జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చెయ్యగా అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..తెలుగు లో మంచి TRP రేటింగ్స్ ని కూడా సొంతం చేసుకుంది ఈ సీరియల్..అలా సీరియల్స్ ద్వారా ఈమె పేరు మారుమోగిపోవడం తో సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టారు..అలా హిందీ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, తెలుగు లో సూపర్ హిట్టైన జెర్సీ సినిమాని హిందీ లో రీమేక్ చెయ్యగా అక్కడ కూడా హీరోయిన్ గా నటించింది.

తెలుగు లో సీతారామన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తోలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకుంది..ఇప్పుడు ఈమెకి టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ కురుస్తుంది..పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు మరియు హీరోలు కూడా ఈమెని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఒక్క తెలుగు లో మాత్రమే కాదు..తమిళ్ లో కూడా ఈమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి..30 ఏళ్ళ వయస్సులో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.