AP No1 In The Country: అభివృద్ధికి సోపానం వచ్చే పెట్టుబడులే. ఈ విషయంలో అందరూ తెలంగాణనే టాప్ అనుకుంటారు.. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది కేసీఆర్ సర్కార్ పరిస్థితి.. పెట్టుబడుల ప్రవాహంలో ఏపీ ఎక్కడో ఉంది అని అందరూ ఆరోపిస్తున్న వేళ.. తిట్టిన నోటితోనే పొగిడించుకుంటోంది జగన్ సర్కార్..

అభివృద్ధి, పెట్టుబడుల్లో తెలంగాణ దూసుకుపోతోందని ఓ వైపు కేసీఆర్, కేటీఆర్, వారి అనుకూల మీడియా హోరెత్తిస్తుంటే ఏమో అనుకున్నారు. తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తుందని అందరం భ్రమించాం.. ఇక ఏపీలో జగన్ తీరుతో పెట్టుబడులు రావడం లేదని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని.. రాష్ట్రం అంధకారం అవుతుందని చంద్రబాబు వారి అనుకూల మీడియా ఊదరకొడుతుంటే అంత నిజం అనుకున్నారు. కానీ నవ్విన నాపచేనే పండింది. జగన్ సర్కార్ దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ గా నిలిచింది. అసలు లెక్కలు చూస్తే మాత్రం అందరికీ షాక్ తగలడం ఖాయంగా మారింది.
భారతదేశంలో పారిశ్రామిక పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ ఏడాది మొదటి ఏడునెలల్లోనే ఏపీ ఏకంగా రూ.40361 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. ఈ టైంలో దేశం అందుకున్న మొత్తం పెట్టుబడులు అక్షరాల రూ.1,71,285 కోట్లు అయితే.. ఇందులో ఏపీనే ఏకంగా 40వేల కోట్ల పెట్టబడులు పొందడం విశేషం.
పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ టాప్ 1లో ఉంది. రెండో స్థానంలో ఒడిశా నిలిచాయి. ఒడిసా రూ.35, 828 కోట్ల పెట్టుబడులు సాధించింది. ఏపీ, ఒడిశా ఈ రెండు రాష్ట్రాలు దేశంలోనే 45 శాతం పెట్టుబడులు రాబట్టినట్టు కేంద్రప్రభుత్వ సంస్థ ‘డీపీఐఐటీ’ జూలై నివేదికలో తెలిపింది. ఇక తెలంగాణకు కేవలం గడిచిన 7 నెలల్లో 2717 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. ఇది చాలా అత్పల్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్, కేటీఆర్ మాటలకు.. వచ్చే పెట్టుబడులకు అసలు పొంతనే లేదని అర్థమవుతోంది.
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రాకు పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్షాలన్నీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కానీ వీటిల్లో నిజం లేదని కేంద్రం నివేదికతో మరోసారి స్పష్టమైంది. జగన్ ప్రమాణ స్వీకారం చేశాక వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఏపీ కేబినెట్ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన 1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వీటి వల్ల 40330మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.
ఇక సీఎం జగన్ దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు భారీగా ఒప్పందాలపై సంతకాలు చేశారు. త్వరలోనే విశాఖలోనూ ప్రపంచ ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్’ ఐటీ ఆఫీస్ కూడా ప్రారంభం కానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి శివారు ప్రాంతాల్లో సుమారు రూ.6వేల కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు ఏర్పాటు కానున్నాయి.

మొత్తంగా భారదేశంలోనే పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఏపీ మారిందని ‘డీపీఐఐటీ’నివేదిక నిగ్గుతేల్చింది. ఈ పరిణామం.. జగన్ సర్కార్ ను విమర్శిస్తున్న వారికి చెంప పెట్టులా మారింది. అదే సమయంలో ఏపీకి తెలంగాణకు మించి పెట్టుబడులు వచ్చాయా? అని అందరూ నోరెళ్ల బెడుతున్నారు. తెలంగాణను మించి కాదు.. ఏకంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిసి షాక్ అవుతున్నారు.
ప్రధానంగా ఏపీకి తీర ప్రాంతం ఉండడం.. పోర్టులు, పెట్రోలియం, మౌలిక సదుపాయాల భారీ ప్రాజెక్టులు దక్కడానికి కారణమైంది. బెంగళూరుకు దక్కరగా ఉండడంతో ఏపీ శివారున ఉండడంతో అక్కడ వివిధ రంగాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాకకు కారణమైంది. తెలంగాణలో హైదరాబాద్ లో తప్పితే చుట్టుపక్కల జిల్లాల్లో ఎలాంటి పెట్టుబడులు రావడం లేదు. ఇదే ఏపీ, తెలంగాణకు మధ్య తేడా…