AP Govt: రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.దాంతో చాల మంది రైతులకు ఊరట లభించనుంది.అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం…గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పంటల భీమాకు సంబంధించి అనుసరించిన విధానం అందరికి తెలిసిందే.
ప్రస్తుతం ఇదే విధానాన్ని ఏపీ ప్రభుత్వం అనుసరించబోతుంది అని సమాచారం.వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో పంటల భీమాకు కొత్త విధానాన్ని అమలులోకి తీసుకోని వచ్చారు.అయితే వైసీపీ తీసుకోని వచ్చిన ఈ కొత్త విధానాన్ని కాకుండా పాత విధానాన్నే అనుసరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసారని సమాచారం.దింతో మళ్ళీ పాత విధానం అమలులోకి రానుందని తెలుస్తుంది.
చంద్రబాబు నాయుడు పాత విధానానికి సంబంధించి వ్యవసాయశాఖ అధికారులకు పలు సూచనలు చేసారు.వైసీపీ ఉన్న సమయంలో ఈ క్రాప్ ద్వారా పంటలను నమోదు చేసి పంటల భీమా ప్రీమియం ను ప్రభుత్వమే చెల్లించేది.ఈ విషయం గురించి గతంలో టిడిపి తప్పులు జరిగాయని,సాంకేతిక కారణాలతో చాల మంది రైతులకు భీమా అందలేదని ఆరోపించింది.
అందుకే మళ్ళీ పాత విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది ప్రభుత్వం.ఇది ఇలా ఉంటె గతంలో టిడిపి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని తీసుకోని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అలాగే ప్రభుత్వం డ్రోన్ల సహాయంలో పురుగు మందులు పిచికారీ చేసే విధానం పై అధ్యయనం చేస్తుందని సమాచారం.ఈ క్రమంలో రైతులకు డ్రోన్ల వినియోగం పై ప్రభుత్వం అవగాహనా కల్పించనుంది.