https://oktelugu.com/

AP Employees Strike: ఉద్యోగుల సమ్మె: ప్రభుత్వానికి చెలగాటం.. ఉద్యోగులకు ప్రాణసంకటం

AP Employees Strike: ఏపీలో పీఆర్సీ వివాదం ప్రభుత్వానికి , ఉద్యోగుల మధ్య జరుగుతున్నది. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం అలా చేయలేమని అంటోంది. ఈ క్రమంలోనే చర్చలు అయితే చేద్దామని మరోవైపున పేర్కొంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అలా ఉద్యోగసంఘాలన్నీ ఏకతాటి మీదకు వచ్చి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించేశాయి. కాగా, ఈ సమ్మె ద్వారా ఉద్యోగులకు లాభమా? నష్టమా? అనే చర్చ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 28, 2022 / 12:56 PM IST
    Follow us on

    AP Employees Strike: ఏపీలో పీఆర్సీ వివాదం ప్రభుత్వానికి , ఉద్యోగుల మధ్య జరుగుతున్నది. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం అలా చేయలేమని అంటోంది. ఈ క్రమంలోనే చర్చలు అయితే చేద్దామని మరోవైపున పేర్కొంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అలా ఉద్యోగసంఘాలన్నీ ఏకతాటి మీదకు వచ్చి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించేశాయి. కాగా, ఈ సమ్మె ద్వారా ఉద్యోగులకు లాభమా? నష్టమా? అనే చర్చ జరుగుతున్నది.

    AP Employees Strike

    సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లినట్లయితే వారికి వేతనాలు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే అవకాశాలుంటాయని పలువురు అంటున్నారు. సమ్మె నుంచి ఉద్యోగులు తప్పుకోవాలనే వాదన ప్రభుత్వం చేస్తున్నది. మరో వైపున తాము చేసే సమ్మె చూసి ప్రభుత్వమే భయపడి దిగిరావాలన ఉద్యోగాలు అనుకుంటున్నారు. ఈ సమ్మె ద్వారా ఎవరికి లాభం అనేది తెలియాలంటే కాలం గడవాల్సిందే. అయితే, గతంలో సమ్మెల వలన ఉద్యోగులకు కొన్ని సార్లు లాభాలు జరిగాయి. కాగా, ఆ సమ్మెలను ఏదో విధంగా అణచివేసి ప్రభుత్వాలు కూడా ఉద్యోగులను తమ దారికి తెచ్చుకున్నాయి.

    AP Employees Strike

    ఉద్యోగుల విషయమై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. పీఆర్సీ అమలులో వెనక్కు తగ్గేదేలే అని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కమిటీ సభ్యులు అయిన మంత్రులు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకుగాను వస్తున్నారు. కానీ, ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వెళ్లడం లేదు. అయితే, ఎప్పటికైనా ప్రభుత్వం వద్దకే ఉద్యోగులు రావాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమ్మెను సర్కారు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని వాదన కూడా ఉంది. ఇకపోతే సమ్మెల విషయాన్ని కోర్టులు సమర్థిస్తాయా? గతంలో వచ్చిన తీర్పులు ఏం చెప్తున్నాయి. అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.

    Also Read: AP Employees: ఏపీ ఉద్యోగులకు జీతాల తిప్పలు? .. ఈనెల వేతనాలు అందుతాయా?

    ఏపీ సర్కారు ఈ విషయం తెలుసుకునే ధీమాగా ఉంటుందా? అనే చర్చ కూడా ఉంది. తెలంగాణలో కొన్నాళ్ల కిందట ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. అయితే, అప్పుడు కూడా తెలంగాణ సర్కారు అస్సలు ఆ సమ్మెను పట్టించుకోలేదు. దాదాపు రెండు నెలల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే అస్సలు ఆ సమ్మెను పట్టించుకోలేదు తెలంగాణ సర్కారు. హైకోర్టు సైతం ఉద్యోగుల సమ్మెను సమర్థించకపోవడంతో.. చివరకు ఉద్యోగులే మళ్లీ ప్రభుత్వాన్ని ప్రాధేయపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె వలన లాభం జరుగుతుందని భావిస్తున్నారు. కానీ, చివరకు వారు మళ్లీ ప్రభుత్వం వద్దకే వెళ్లాల్సి ఉంటుందని కొందరు గత అనుభవాలను ఆధారం చేసుకుని విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి.. ఏపీలో ఏం జరుగుతుందో..

    Also Read: AP Employees: ఏపీ ఉద్యోగుల్లో టెన్షన్.. వేతనాలు సమయానికి అందుతాయా?

    Tags