Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ షో ఎన్నో రోజుల నుంచి రన్ అవుతున్నా.. కొన్ని సార్లు నెగిటివ్, మరికొన్ని సార్లు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే కంటెస్టెంట్స్ కూడా కొందరు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మరికొందరు మాత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటారు. ఇదిలా ఉంటే శివాజీపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ప్రచారం ఎక్కువగా పెరుగుతోంది. అంతే కాదు ఈ సీజన్ నుంచి రీసెంట్ గా బయటకు వచ్చిన అశ్విని కూడా ఈయన మీద నెగిటివ్ కామెంట్లు చేసింది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ శివాజీని టార్గెట్ చేస్తుండటం గమనార్హం. ఇక ఈ ఇంటి నుంచి బయటకు వచ్చిన అశ్విని శ్రీ అభిమానులతో ముచ్చటించారు. నీ వల్ల బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ఉపయోగం ఏంటనే ప్రశ్న కూడా ఎదురైంది. దీనికి స్పందిస్తూ ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానని అసహనం వ్యక్తం చేసింది అశ్విని. బిగ్ బాస్ ఇంట్లోకి అందరూ కప్పు గెలవడానికే వస్తారని.. కానీ తనకు ఎదురైన అనుభవాలు సరిగ్గా లేవని అన్నారు అశ్విని.
అందుకే బిగ్ బాస్ హౌస్ ను చూద్దామని వచ్చానని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో అప్పటికే హౌస్ లో ఉన్నవారు కలుపుకోలేదని అశ్విని తెలిపారు. మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపించాలా అని ఫీల్ అయ్యేవారని అన్నారు అశ్విని. తనతో మాట్లాడేందుకు ఎవరికి ఆసక్తి చూపకపోవడంతో మానసిక వేదన అనుభవించానని అశ్విని తెలిపారు. అంతే కాదు తాను అందరితో స్నేహంగా ఉంటానని హౌస్ లో ఉన్న పరిస్థితుల వల్లే ఉమెన్ కార్డ్ వాడానని తెలిపింది. ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ఎమోషన్స్ ఉంటాయని.. కష్టం వస్తే తప్ప ఊరికే ఏడవనని ఆవేదన వ్యక్తం చేశారు అశ్విని.
ఇలా అన్నింటి గురించి మాట్లాడిన అశ్విని శివాజీ గురించి కూడా మాట్లాడింది. శివాజీ పాములాంటి వారని.. హౌస్ లో పెద్ద పాము ఉందని కామెంట్లు చేశారు అశ్విని. అంతే కాదు తాను ఎవరిని వెన్నుపోటు పొడవలేదని హౌస్ లో భోలే షావళితో కనెక్ట్ అయ్యానని అన్నారు. తను మంచి ఫ్రెండ్ అని తొందరగా కలిసిపోయే గుణం ఉందని కొనియాడింది అశ్విని.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Do you know what happened to ashwini who came from the bigg boss house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com