https://oktelugu.com/

Manjusha Rampalli: జబర్దస్త్ లో అనసూయ ప్లేసులో ఏం యాంకర్ ను తీసుకుంటున్నారో తెలుసా?

Manjusha Rampalli: జబర్దస్త్ షోకు యాంకర్ అనసూయ గుడ్ బై చెప్పనుందా? ఆమె ఈ షో ద్వారా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే ఈ షో ద్వారా అనసూయ పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకోవడంతో ఆమెకు నిజంగానే క్రీజే ఏర్పడింది. భవిష్యత్ లో కూడా ఆమె స్థానం మంచి పొజిషన్ లో ఉంటుందని అందరు భావించారు. కానీ జబర్దస్త్ షో లో ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఇన్నాళ్లు షోను అట్టిపెట్టుకుని ఉన్న అనసూయ త్వరలో జబర్దస్త్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 30, 2022 / 04:19 PM IST
    Follow us on

    Manjusha Rampalli: జబర్దస్త్ షోకు యాంకర్ అనసూయ గుడ్ బై చెప్పనుందా? ఆమె ఈ షో ద్వారా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే ఈ షో ద్వారా అనసూయ పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకోవడంతో ఆమెకు నిజంగానే క్రీజే ఏర్పడింది. భవిష్యత్ లో కూడా ఆమె స్థానం మంచి పొజిషన్ లో ఉంటుందని అందరు భావించారు. కానీ జబర్దస్త్ షో లో ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఇన్నాళ్లు షోను అట్టిపెట్టుకుని ఉన్న అనసూయ త్వరలో జబర్దస్త్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. దీంతో అనసూయ స్థానం ఎవరితో భర్తీ చేయనున్నారనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ షో ఇటీవల కాలంలో తన ప్రభావాన్ని చూపలేకపోతోందని తెలుస్తోంది.

    Manjusha Rampalli

    జబర్దస్త్ తో పాటు ఎక్స్ ట్రా జబదర్దస్త్ నిర్వహిస్తున్నారు. ఇందులో యాంకర్ గా రష్మీ గౌతమ్ తన అందంతో అదరగొడుతోంది. జబర్దస్త్ కు దీటుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ రూపుదిద్దుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనసూయ ఇటీవల సినిమాల్లో బిజీగా ఉంటోంది. ఈ కారణంగానే జబర్దస్త్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. జబర్దస్త్ లో అనసూయ స్థిరంగానే ఉంటుందని అందరు అనుకున్నా చివరకు ఆమె కూడా తన దారి తాను చూసుకుంటుందనే తెలుస్తోంది.

    Also Read: Laila: అరె.. ఆమె కూడా సెగలు పుట్టిస్తోందట !

    జబర్దస్త్ కు మొదట శ్రీముఖిని కూడా యాంకర్ గా చేయాలని అడిగారట. కానీ జబర్దస్త్ ఇంత పెద్ద హిట్ సాధిస్తుందని అనుకోకపోవడంతో నిరాకరించినట్లు సమాచారం. దీంతోనే అనసూయకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆమె తిరుగులేదని అనిపించుకుంది. కమెడియన్లలో ఎప్పుడు జోష్ నింపుతూ జబర్దస్త్ ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. జబర్దస్త్ షో ద్వారానే అనసూయకు సినిమా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చాయి. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో తనదైన శైలిలో రాణించి సినిమాల్లో దూసుకుపోతోంది.

    Manjusha Rampalli

    అనసూయ స్థానాన్ని మంజూష రాంపల్లితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనసూయ దూరమైతే పరిస్థితి ఏంటనే దానిపై చర్చలు సాగుతున్నాయి. అనసూయకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కానీ మంజూషకు తక్కువ అంటే రూ.50 వేల వరకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని సమాచారం. అందుకే పారితోషికం విషయంలో యాజమాన్యం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. అందుకే జబర్దస్త్ షో పలు మార్పులు చోటుచేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    Also Read:Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ’6 డేస్ కలెక్షన్స్’.. ఇది బిగ్ ప్లాప్ !

    Tags