https://oktelugu.com/

KTR- Modi: మోడీదీ మోసమైతే తమరిదేంటిది కేటీఆర్ సార్?

KTR- Modi: దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీఆర్ఎస్ అన్ని దారులు వెతుకుతోంది. అన్ని మార్గాల్లో బీజేపీ విధానాలు ఎండగట్టాలని చూస్తోంది. దీని కోసమే బీజేపీ హైదరాబాద్ నగరంలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాలపై విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే అని బుకాయిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చే మాటలన్ని మోసపూరితమే అని ఎండగడుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కూడా సరైన విధంగానే స్పందిస్తున్నారు.ఇలాగైతే తమరు చేసేవి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 30, 2022 / 04:26 PM IST
    Follow us on

    KTR- Modi: దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీఆర్ఎస్ అన్ని దారులు వెతుకుతోంది. అన్ని మార్గాల్లో బీజేపీ విధానాలు ఎండగట్టాలని చూస్తోంది. దీని కోసమే బీజేపీ హైదరాబాద్ నగరంలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాలపై విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే అని బుకాయిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చే మాటలన్ని మోసపూరితమే అని ఎండగడుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కూడా సరైన విధంగానే స్పందిస్తున్నారు.ఇలాగైతే తమరు చేసేవి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    KTR- Modi

    దళితులను సీఎం చేస్తామని చెప్పారు కదా అది ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఇష్తామని హామీ ఇచ్చారు? దళితుడిని సీఎం చేస్తామన్నారు? కాంటాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు. ఉచిత ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు. ఇవన్ని చెప్పిన తమరు మోసకారులు కాదా? తమరు చేసింది మాత్రం మోసం కాదా అని ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ ఏం చెబుతారు? వీటిపై ఎందుకు సమాధానం చెప్పరు అని విమర్శిస్తున్నారు.పీఎం నరేంద్ర మోడీపై కేటీఆర్ చేసిన విమర్శలకు ధీటుగానే స్పందించారు.

    Also Read: AB Venkateswararao: అధికారం ముందు మోకరిల్లాల్సిందే.. ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు దేనికి సంకేతం?

    తాను చేస్తే శృంగారం పక్కవాడు చేస్తే వ్యభిచారం అనే నానుడి ప్రకారం మీరు చేస్తే మంచి మరొకరు చేస్తే అది చెడ్డదా? అని సూటిగా అడుగుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఏం చెబుతుందని ఆవేశంగా నిలదీస్తున్నారు. కేంద్రంలో బీజేపీ చేస్తున్న పనులపై ఎందుకంత జలసీ అని తమ మనసులోని మాట వెల్లగక్కుతున్నారు. మంత్రి కేటీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

    KTR- Modi

    బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు వెళ్లగక్కుతూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ లో విచక్షణ కోల్పోతున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ పై టీఆర్ఎస్ కావాలనే దురుద్దేశంతో వ్యవహరించడం సమంజసం కాదని చెబుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి వాటికి తగిన ప్రతిఫలం చెల్లించుకోవడం ఖాయమనే జోస్యం చెబుతున్నారు. రెండు పార్టీల్లో కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరడం గమనార్హం.

    Also Read:BJP Big Strategy: బీజేపీ భారీ వ్యూహం.. రాష్ట్రాల కమ్యూనిటీలతో సమావేశం

    Tags